(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
నివిన్ పాలీ తీసిన లవ్ యాక్షన్ డ్రామా మళయాళం సినిమాలో ఒక పాట సూపర్ హిట్ అయింది. ఈ కుడుక్కు పాటకు చాలాచోట్ల చాలమంది ఓనం పండగ సంబరాలలో కాలు కదుపుతున్నారు. తాజాగా ఢిల్లీలో ఒకచోట ఒక క్రిష్టియన్ ఫాదర్ కుడుక్కు పాటకు మరో ఇద్దరు డాన్సర్లతో కలిసి చేసిన డాన్స్ ఇన్స్టాగ్రామ్లో సంచలనం అయింది. నివిన్ పాలీ ఆ వీడియోను పోస్టు చేశారు.
https://www.instagram.com/p/B2eUwMRlAuI/
ఫాదర్ మాధ్యూ కిళచెచిర కు బోలెడు అభినందనలు అందుతున్నాయి. మూడు రోజుల క్రితం పెట్టిన ఈ వీడియోకు ఇప్పటివరకూ 26 లక్షల వ్యూస్ వచ్చాయి. ఆ డాన్స్ అప్పటికప్పుడు అనుకుని చేసిందనీ, ఇంత ఫాలోయింగ్ వస్తుదని తాను ఆశించలేదనీ ఫాదర్ మాధ్యూ న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికతో అన్నారు. కుడక్కు పాట వీడియోను యుట్యూబ్లో ఇప్పటివరకూ 67 లక్షల మంది చూశారు.
కుడుక్కు పాట టీజర్ మీరూ చూడండి