(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఐర్లాండ్ తీరంలో నిమిదిన్నర అడుగుల పొడవున్న ట్యూనా చేప. దాని బరువు 270 కిలోలు. మార్కెట్లో ధర రూ. 23 కోట్ల పైమాటే. ఇలాంటి ఖరీదైన చేప చిక్కినా మళ్లీ నీళ్లలో వదిలేశాడో వ్యక్తి. ఐర్లాండ్ తీరంలో 8.5 అడుగుల భారీ ట్యూనా చేప డేవ్ ఎడ్వార్డ్స్ అనే వ్యక్తి వలకు చిక్కింది. కానీ దాన్ని తిరిగి నీటిలో వదిలేశారు. ఈ ఏడాది ఐర్లాండ్లో వలకు చిక్కిన అతి పెద్ద ట్యూనా చేప ఇదే. జపాన్లో దీని ధర రూ.23 కోట్లు పలుకుతుందని ఐరిస్ మిర్రర్ తెలిపింది. అయితే, తాము సరదా కోసమే చేపలు పడుతున్నామని, వాటిని అమ్మడం ఉద్దేశం కాదని డేవ్ చెప్పాడు. తాము ఉంటున్న ప్రాంతంలో ఎలాంటి చేపలు ఉన్నాయో తెలుసుకోవడానికే ఇలా చేపలను పట్టి వదిలేస్తున్నామని తెలిపాడు. అయితే, భారీ ట్యూనా చేప… వలకు చిక్కడాన్ని ఒకరు ఫొటో తీశాడు. దాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఇప్పుడీ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.facebook.com/589779378186895/photos/a.589797241518442/690149864816512/?type=3