(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఒక మహిళా పాత్రికేయురాలు లైవ్ టెలికాస్ట్ నిర్వహిస్తుండగా ఒ యువకుడు ముద్దు పెట్టుకొని బుక్కయ్యాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమెరికాకు చెందిన వేవ్ 3 న్యూస్ ఛానెల్లో సారా రివెస్ట్ అనే మహిళా జర్నలిస్ట్ న్యూస్ రూమ్‌లో యాంకర్‌కు లైవ్‌లో వార్త రిపోర్టు చేస్తుండగా ఒక యువకుడు హఠాత్తుగా పక్కకు వచ్చి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్లిపోయాడు. అయితే ఆ పాత్రికేయురాలు మాత్రం ఈ హఠాత్మరిణామానికి ఒకింత అసహనానికి గురైనా వార్త రిపోర్టు చేయడం ఆపకుండా కొనసాగించింది.
అనంతరం ఈ ఘటనపై సారా పోలీసులకు ఫిర్యాదు చేయగా ముద్దు పెట్టిన వ్యక్తి ఎరిక్ గూడ్ మ్యాన్‌గా పోలీసులు గుర్తించి అతనిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనపై ఆ యువకుడు పాత్రికేయురాలికి క్షమాపణ చెబుతూ లేఖ రాశాడు.
Hey mister, here’s your 3 seconds of fame. How about you not touch me? Thanks!! pic.twitter.com/5O44fu4i7y
— Sara Rivest (@SRivestWAVE3) September 20, 2019