26.7 C
Hyderabad
March 31, 2023
NewsOrbit
Right Side Videos

పార్లమెంట్‌లో చిన్నారి..స్పీకర్‌ ఫీడింగ్‌..

Share

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

న్యూజిలాండ్‌ పార్లమెంట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సభలో అధికార విపక్షాల ఆందోళనలు కాకుండా చిన్నారి ఏడుపు వినిపించింది. తమాటీ కోఫీ అనే ఎంపీ నెల వయసున్న తన కుమారుడిని పార్లమెంటుకు తీసుకొచ్చింది. సభా చర్చలో భాగంగా కోఫీ ప్రసంగించాల్సి వచ్చింది. అయితే, ఆ సమయంలో బాబు ఏడవడంతో స్వయంగా స్పీకర్‌ ట్రెవోర్‌ మల్లార్డ్‌ తన కుర్చీ వద్దకు తీసుకు రమ్మని ఆదేశించారు. అనంతరం  ఆ చిన్నారికి పాలు కూడా పట్టారు. ఓ వైపు పాలు పడుతూనే సభలో సభ్యుల ప్రసంగాలు వింటూనే ఫిడింగ్ పట్టారు. అంతే కాదు ఆ చిన్నారితో ఆడుకుంటూనే సమయానికి మించి ఎక్కువసేపు మాట్లాడిన వారిని వారించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్పీకర్ ఆ బిడ్డకు పాలు పట్టించి, లాలించడం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Share

Related posts

పెద్ద పులుల మధ్య భీకర పోరాటం!

Mahesh

వీధి రౌడీ కాదు – ప్రజాప్రతినిధి

somaraju sharma

వరద నీటిలో యువతి ఫొటో షూట్‌!

Mahesh

Leave a Comment