(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
పెళ్లిళ్లలో మహిళలు ఉన్న నగలన్నీ పెట్టుకుని తయారవుతారు. ఇక వధువు గురించి అయితే చెప్పనక్కరలేదు. వంటి నిండా బంగారు ఆభరణాలతో అలంకరించుకుంటారు. పాకిస్థాన్లో ఒక పెళ్లికూతురు బంగారు నగలకు బదులు టమోటా నగలతో అలంకరించుకుంది. ఆమెను ఒక న్యూస్ ఛానల్ విలేఖరి చేసిన ఇంటర్వ్యూ వైరల్ అయింది.
Tomato jewellery. In case you thought you've seen everything in life.. pic.twitter.com/O9t6dds8ZO
— Naila Inayat (@nailainayat) November 18, 2019
పాకిస్థానీ జర్నలిస్టు నైలా ఇనాయత్ ఆ ఇంటర్వ్యూలో కొంత భాగాన్ని ట్వీట్ చేశారు. బంగారం ధర బాగా పెరిగింది. అలానే టమోటాల ధర కూడా బాగా పెరిగింది. అందుకే నేను టమోటాలు ధరించాలని నిర్ణయించాను అని అందులో ఆ వధువు చెబుతుంది. పాకిస్థాన్లో ప్రస్తుతం కిలో టమోటాలు 300 రూపాయలు అమ్ముతున్నాయి.