వీరి టైం బాగోలేదు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

రోడ్లపై ఎంత జాగ్రత్తగా వెళ్లినా.. టైమ్ బాగోలేకపోతే ఎవరో ఒకరు వచ్చి గుద్దేసి వెళ్లిపోతారు. కానీ ఒకే వ్యక్తిని రెండు స్లారు గుద్దితే? రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఓ యువతి స్కూటర్ తో ఢీకొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టర్నీలోని ఓ ప్రాంతంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ మహిళ స్కూటర్‌పై వెనకాల నుంచి ఢీకొట్టింది. అతడు కోపంగా ఆమె వైపు చూడటంతో సారీ చెప్పి తప్పించుకుంది. దీంతో ఆ వ్యక్తి ఆమెను ఏమీ అనకుండా మళ్లీ రోడ్డు దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ఆమె కూడా స్కూటర్‌తో యూటర్న్ తిరగబోయింది. అయితే, ఈ సారి కూడా ఆ వ్యక్తినే మరింత గట్టిగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. అయితే, ఆ తర్వాత ఏం జరిగిందనేది మాత్రం తెలియరాలేదు. సీసీటీవీ కెమేరాలో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు యువతి పొరపాటున ఢీకొట్టిందా లేక కావాలనే ఢీకొట్టిందా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.  పాపం ఆ వ్యక్తి పరిస్థితి చూస్తే ప్రతి ఒక్కరికీ జాలి కలుగుతుంది.