NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

హరీష్ రావు ‘పాల అమ్మకం ఐడియా’ వెనక కే‌టి‌ఆర్ ఇన్ డైరెక్ట్ ఫోర్స్ ఉందా ??

తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ హరీష్‌రావు కొత్తగా ప్రారంభించిన పాల వ్యాపారం. అదేమిటి? అంతటి సీనియర్ రాజకీయవేత్త…. టిఆర్ఎస్ పార్టీలో అగ్రగామిగా వెలుగొందుతున్న నాయకుడు పాల వ్యాపారం చేయడం ఏమిటి….? ఇదే అందరికీ సందేహంగా ఉందా?

కారణం అదే…. మరి కారకులు?

హరీష్ రావు, అతని భార్య శ్రీయుత పాల ఉత్పత్తులు వ్యాపారంలోకి అడుగుపెడుతున్నాము అని ముందే చెప్పారు. తాజాగా దంపతులిద్దరూ దీనిని అధికారికంగా ప్రకటించారు కూడా. మిల్క్ ప్రొడక్ట్స్ కి సంబంధించిన వివరాలను హరీష్ రావు భార్య మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు. కరోనా కష్టకాలంలో పాలను తాగడం, పాలతో తయారయ్యే పదార్థాలను తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుందని చాలా మంచి ఉద్దేశంతో మేము ఈ వ్యాపారాన్ని మొదలు పెడుతున్నాము అని ఆమె అన్నారు. అయితే దీని వెనుక మాత్రం మరో బలమైన కారణం ఉందని తెలంగాణ ప్రజలు, టిఆర్ఎస్ పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

గతం చూస్తే అంతా అనుమానమే…!

మనం గతం చూసుకుంటే…. టిఆర్ఎస్ పార్టీలో ఒక వర్గం వారు కెసిఆర్ తర్వాత ఆ సీఎం పదవి హరీష్ రావు ని వరించాలి అని కోరుకున్నారు. హరీష్ రావు మాత్రం బయటకు నేను ‘కెసిఆర్ బంటు’ అంటూ వచ్చాడు. ఎప్పుడూ పార్టీ అవసరాలే తనకు ప్రధానమని చెబుతూనే ఉన్నాడు. అయితే కేటీఆర్… హరీష్ రావుకు ఈ పవర్ విషయంలోనే పలుమార్లు విభేదాలు వచ్చాయని…. కెసిఆర్ వాటిని పరిష్కారం చేయలేక అష్టకష్టాలుపడుతున్నాడని అప్పట్లో ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక హరీష్ రావు మాత్రం తాను కేసీఆర్ పక్క అన్నాదు…. కేటీఆర్ మాత్రం స్పందించలేదు. కేసీఆర్ తన కొడుకుని ముఖ్యమంత్రి చేసే ప్రణాళికల్లో భాగంగా హరీష్ రావు కి మినిస్టర్ పదవి కట్టబెట్టాలని…. అతనిని వెంటనే పెట్టుకుంటూ కేటీఆర్ కి గాడ్ ఫాదర్ లాగా వ్యవహరించేలా హరీష్ రావు ని తయారు చేస్తున్నారని అంటుంటారు. ఇది గతం.

ఇదంతా ముందుచూపేనా…?

ప్రస్తుతానికి వస్తే పాల ఉత్పత్తులు వ్యాపారాన్ని హరీష్ రావు మొదలుపెట్టడం వెనుక కేటీఆర్ పరోక్షంగా ఫోర్స్ చేశారని తెలుస్తోంది. కేటీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత అతనికి గతం లో హరీష్ రావు తో ఉన్న విభేదాల కారణంగా అతనికి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేస్తారన్నది టిఆర్ఎస్ పార్టీలో ఒక వర్గాలు అనుకుంటున్న మాట. ఆర్థికంగా హరీష్ రావు మరింత బలపడేందుకు అతనికి రాజకీయంగా పెద్దగా అవకాశాలు ఉండబోవు. కేటీఆర్ అతని తండ్రి కంటే ఖరాఖండిగా ఉంటాడు. అందుకే హరీష్ రావు తన సొంత కాళ్ళపై తాను నిలబడాలని ఏపీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ని అనుసరించి ‘హెరిటేజ్’ వంటి పాల ఉత్పత్తుల వ్యాపారాన్ని కేవలం కేటీఆర్ ముప్పు నుండి తనను తాము రక్షించుకునేందుకు ప్రత్యామ్నాయంగా పెట్టారని కొంతమంది అంటున్నారు. ఇది చాలా సెటైరికల్ గా ఉన్నా కూడా…. ఇందులో వాస్తవం ఏమిటి అనేది హరీష్ రావుకి కేటీఆర్ కే తెలియాలి.

Related posts

AP Elections 2024: అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై ఈసీ వేటు

sharma somaraju

Land Titiling Act: ఏపీలో ల్యాండ్ సమస్యలపై విశ్రాంత ఐఏఎస్ పీవీ రమేష్ సంచలన పోస్టు .. సోషల్ మీడియాలో వైరల్

sharma somaraju

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju