NewsOrbit
న్యూస్

ఆ మాజీ విషయంలో తండ్రీ కొడుకులు తగాదా పడ్డారట ! ఏమిటా కథాకమామిషు

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిలోనే పోరు మొదలయిందని ఒక టాక్ వినవస్తోంది. స్వయానా కుమారుడు చినబాబు లోకేష్ బాబు తండ్రిపై అలిగి అమరావతికి పరిగెత్తి వచ్చాడట.

In that former case, the father and son quarre What a storyteller
In that former case, the father and son quarre What a storyteller

మళ్లీ చంద్రబాబు బతిమాలితే లోకేష్ చల్లబడి హైదరాబాద్ వెళ్లాడని సమాచారం.వివరాల్లోకి వెళితే లోకేష్ ఈ మధ్య రాజకీయంగా అన్ని విషయాలను పరిశీలిస్తున్నారు. 2024 ఎన్నికల్లో టీడీపీ గెలవకపోతే ఇక పార్టీ దుకాణం మూసుకునే పరిస్థితి వస్తుందని ఆందోళనగా ఉన్నాడట.. అందుకే మంచి మెరుగైన నేతలను ఎంపిక చేసుకొని తన వెంట ఉంచుకోవాలని.. అతిగా మాట్లాడే వాళ్లను ప్రోత్సహించవద్దని  డిసైడ్ అయ్యాడట.. వాళ్ల వల్ల మిగతా నేతలు దూరం అవుతున్నారని.. పార్టీ నాశనం అవుతోందని లోకేష్ బలంగా నమ్ముతున్నాడట. ఎవరి వల్ల ఏ జిల్లాలో పార్టీకి నష్టం జరుగుతోందని లోకేష్ బాబు ఒక సర్వే చేయించుకున్నాడు

ఇందులో వచ్చిన నివేదిక ఆధారంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉండే కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి దేవినేనిఉమామహేశ్వరావు వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని లోకేష్ బాబు అంచనా వేశాడట .దేవినేనికి ఆ జిల్లాలో ఉన్న ఎవరికి పడదని తేల్చాడట.. దేవినేనికి ఇగో ఎక్కువని.. అతడు ఎవరిని కలుపుకొని పోడు అని రిపోర్టులు లోకేష్ కు అందాయట.అయితే తండ్రి చంద్రబాబు నాయుడు కృష్ణా జిల్లాల్లో దేవినేని ఉమామహేశ్వరరావుకు టాప్ ప్రియారిటీ ఇవ్వడాన్ని లోకేష్ గుర్తించాడు.దీంతో లోకేష్ తండ్రి చంద్రబాబును కలిసి దేవినేని ఉమామహేశ్వరరావుకు ప్రాధాన్యత తగ్గించమని సూచించాడట.తన సర్వేలన్నీ లోకేష్ చంద్రబాబు ముందుంచగా.. అవన్నీ ట్రాష్ అని ఆయన కొట్టిపారేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

లోకేష్ దీంతో చిన్న బుచ్చుకున్నాడని ,దేవినేనికి ప్రాధాన్యత తగ్గించమంటే చంద్రబాబు అంగీకరించకపోవడంతో అలిగి అమరావతి వచ్చాడని ఒక సమాచారం .దేవినేని విషయంలో తండ్రీకొడుకుల మధ్య పెద్ద ఎత్తున ఇంట్లో గొడవ జరిగిందని.. ఆ తరువాత హైదరాబాద్ నుంచి లోకేష్ విజయవాడకు వచ్చాడని సమాచారం. దీంతో చంద్రబాబు ఫోన్లో బుజ్జగిస్తే అప్పుడు చల్లబడి హైదరాబాద్ వెళ్లాడని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ఈ వ్యవహారం టిడిపి లో హాట్ టాపిక్ గా మారింది చంద్రబాబు ఇంటా బయటా సమస్యలు ఎదుర్కొంటున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju