NewsOrbit
ట్రెండింగ్ హెల్త్

మధుమేహంతో బాధపడేవారికి అద్భుతమైన చిట్కా.. ఒక్కసారి పాటిస్తే?

మారుతున్న కాలానికి అనుగుణంగా, మన ఆహారపు అలవాట్లలో కూడా చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా చిన్నా, పెద్ద అని వయసుతో సంబంధం లేకుండా మధుమేహంతో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం 422 మిలియన్ మంది ప్రజలు మధుమేహంతో బాధపడుతుండగా 1.6 మిలియన్ మంది మధుమేహంతో మరణిస్తున్నారు.

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం 2030 నాటికి కల్ల ప్రపంచంలోనే అతిపెద్ద కిల్లర్ గా మధుమేహం ఉంటుందని పేర్కొంది. మధుమేహం అనేది దీర్ఘకాలికంగా మనల్ని వెంటాడే ఒక వ్యాధి. మరి ఇలాంటి మధుమేహాన్ని అరికట్టడానికి వేపలో ఎన్నో గుణాలు కలిగి ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఇంతటి ఔషధగుణాలు కలిగిన వేపను తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

మధుమేహంతో బాధపడేవారు వారికి ఆహార విషయంలో ఎంతో మెలకువలు అవసరం. వీలైనంతవరకు వారి ఆహారంలో ఎలాంటి చక్కెరలు లేకుండా, పిండిపదార్థాలు కార్బోహైడ్రేట్ల పరిమాణం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇలాంటి వారి ఆహార విషయంలో తగు జాగ్రత్తలు పాటించక పోయినా, శరీరంలో చక్కెర సాధారణ స్థాయిలో లేకున్నా, మధుమేహంతో పాటు గుండె సమస్యలు, మూత్రపిండ సమస్యలు, అధిక రక్తపోటుతో మరణించే అవకాశం ఉంది. మధుమేహంతో బాధపడేవారు వేపను తీసుకోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.

వేప చెట్టు నుంచి లభించే ఆకులు, వేర్లు, కలప, విత్తనాలు ఇలా మొదలైన ప్రతి ఒక్క భాగంను ఉపయోగించి ఎన్నో రకాల వ్యాధులను నయం చేయడం మన పురాతన కాలం నుంచి ఉంది. వేప ఆకులలో ఫ్లేవనాయిడ్లు, ట్రైటెర్పెనాయిడ్ అధికంగా ఉండటం వల్ల  రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడానికి దోహదపడతాయి. అంతేకాకుండా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు మెండుగా ఉండటం వల్ల అనేక చర్మ వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.

ప్రతిరోజు ఉదయం రెండు వేపాకులను నమిలి తినడం వల్ల అందులో ఉన్న ఫ్లేవనాయిడ్లు మన శరీరంలో చక్కెర స్థాయిలను నిలకడగా ఉంచుతాయని ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ ఫార్మా కాలేజీ ఒక అధ్యయనంలో పేర్కొంది. వేప ఆకులను నమిలి తినడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారు వేపాకులను కొద్దిగా నీటిలో మరిగించి ఆ నీటిని తాగడం వల్ల కూడా మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే వేపాకులను ఎక్కువగా తినడం వల్ల కూడా హైపోగ్లైకేమిక్ ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా వేపాకులను బాగా రుబ్బి మన శరీరానికి అంటించి, స్నానం చేయడం వల్ల ఎన్నో రకాల చర్మ వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు. ఇన్ని ఔషధ గుణాలు ఉన్న వేపను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల మధుమేహానికి దూరం అవ్వచ్చు.

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N

వాట్.. నెల రోజులు ఫోన్ యూస్ చేయకపోతే 8 లక్షలు ఫ్రీనా.. కొత్త రూల్ అనౌన్స్ చేసిన సిగ్గీస్..!

Saranya Koduri

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Chanakya: డబ్బు వాడకం గురించి సంబోధించిన చాణిక్య.. ఎప్పుడు వాడాలి.. ఎలా వాడాలి..?

Saranya Koduri