NewsOrbit
5th ఎస్టేట్ Featured న్యూస్

దుబ్బాక.. రెండు కుట్రలకు వేదిక..! “న్యూస్ ఆర్బిట్” ఎక్సక్లూజివ్..!!

కుట్ర అంటే మరీ సినిమా డైలాగు అయిపోతుందేమో.. కుతంత్రం, పన్నాగం.., ఇలా ఏ పేరు పెట్టుకున్నా దుబ్బాకలో మాత్రం జరుగుతున్నది అదే, జరిగేది అదే..!!
రాజకీయాల్లో కుట్రలు సాధారణమే.. అయితే అవి బయటకు రావు..!
కేవలం సినిమాల్లో మాత్రమే సినిమాల్లో రాజకీయ కుట్రలు తెలుస్తుంటాయి..! అయితే దుబ్బాక ఉప ఎన్నిక మాత్రం సినీ కుట్రకు మించిన స్థాయి కుట్రలకు వేదిక కాబోతుంది. మొత్తానికి ఎవరూ ఊహించని విధంగా దుబ్బాక ఉప ఎన్నిక నెవర్ బిఫోర్.. నెవర్ ఆఫ్టర్ గా మారబోతుంది..!

ఇవి ఒక్కసారి ఆలోచించారా..!?

అటు సానుభూతి, ఇటు అధికారం, మరోవైపు క్షేత్రబలం కలిసి గెలుపు ఈజీ అనుకుంటున్న టీఆరెస్ ఇలా ఆకస్మికంగా ఒక పెద్ద పన్నాగం ఎందుకు వేయాల్సి వచ్చింది..? బీజేపీ అభ్యర్థి రఘు మామ ఇంట్లో పోలీసులతో డబ్బు పెట్టించి ఎందుకు బలి చేయాలనుకుంది..? పోలీసులు డబ్బు పెట్టాలి అనుకుంటే ఇలా రెడ్ హ్యాండెడ్ దొరికిపోయేలా సిల్లీగా పెడతారా..? పోలీసుల స్టైల్ లో కథని నడిపించేవాడు కదా..? ఇది మొత్తం ఓ పెద్ద డ్రామాగా అనిపించడం లేదా..? కాస్త లాజిక్కులు, ముదిరిన రాజకీయ తరహా ఆలోచనలు చేస్తే దీనిలో ఏదో ఉంది అనిపించడం లేదా..? అందుకే దీనిలో కుట్రల కథలను మనం చెప్పుకోవాల్సిందే..!!

కుట్ర నంబర్ – 1 (కేసీఆర్ X హరీష్ రావు)..!!

అయ్యో.., కేసీఆర్ అంటే మామ.., హరీష్ అల్లుడు. నమ్మిన బంటులా ఉన్నాడు. అటువంటి హరీష్ రావు మీద కేసీఆర్ ఎందుకు కుట్ర చేస్తారు..? తప్పు తప్పు అని కొట్టిపారేయొద్దు..!! దీనిలో నిజానిజాలు ఎలా ఉన్నా..? కొన్ని కీలక పాయింట్లు మాత్రం చెప్పుకోవాలి. ఆ అవకాశాలను మాత్రం చర్చించాలి..!
టీఆరెస్ కి భావి దిక్సూచిగా ఉన్నది కేటీఆర్, హరీష్ రావు..! కేసీఆర్ మాత్రం నిస్సంకోచంగా కొడుకు కేటీఆర్ కె పగ్గాలు ఇస్తారు, పట్టాభిషేకం చేస్తారు. కానీ అక్కడ కేటీఆర్ కంటే హరీష్ రెండాకులు ఎక్కువలోనే ఉన్నారు. హరీష్ మాస్ లీడర్. తెలంగాణ పల్లెల్లో మాంచి పట్టున్న లీడర్. మాటలు, రాజకీయాలు, క్యాడర్ నిర్వహణ అన్నిట్లో మామకి తగ్గట్టే ఉంటారు. కేటీఆర్ అంటే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ మాస్ ఇమేజ్ సొంతం కాలేదు. కేవలం పట్టణ ప్రాంతాల్లోనూ, ఓ వర్గం వారికి మాత్రమే దగ్గరయ్యారు. 70 శాతం పల్లెలతో నిండిన తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కంటే హరీష్ కే ఎక్కువ ఇమేజ్ అనడంలో సందేహం లేదు. అందుకే హరీష్ కి ఎప్పుడూ భారీ ఆధిక్యత వస్తుంటుంది.


* మరి ఈ తరుణంలో కేటీఆర్ ని పైకి ఎక్కించాలి అంటే హరీష్ ని కాస్త దించాలి. పల్లెల్లో హరీష్ పట్టు అంతంతమాత్రమే అనేది క్యాడర్ కి తెలిసేలా చేయాలి. అందుకే కేసీఆర్ ఓ ఆలోచన చేసి హరీష్ ని దుబ్బాక చట్రంలో ఇరికించి ఉండవచ్చు..! ఓడితే హరీష్ కథ గల్లంతు.. గెలిస్తే హరీష్ ఆధ్వర్యంలో జరిగిన తప్పులను సరిదిద్ది మేమె గెలిపించాం అనే గొప్పలకు పోవచ్చు. అయితే దుబ్బాకలో ఇప్పుడు ఓడితే టీఆరెస్ కి తెలంగాణ పల్లెల్లో కష్టకాలం మొదలవుతుంది. బీజేపీ పాతుకుపోతుంది. అల్లుడికి దెబ్బ వేయడానికి కేసీఆర్ అంతగా కుట్రలు చేయకపోవచ్చు.. కానీ పుత్రోత్సాహం కోసం చేసినా చేయొచ్చు..! చెప్పలేం.!!

కుట్ర నంబర్ – 2 (కాంగ్రెస్ & బీజేపీ X టీఆరెస్)..!!

దుబ్బాకలో ఉప ఎన్నిక ఆరంభంలో ముక్కోణ పోటీగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఫైట్ టీఆరెస్ కీ, బీజేపీ కీ మధ్య నడుస్తుంది. ముత్యంరెడ్డి కుమారుడు టీఆరెస్ పై అలిగి కాంగ్రెస్ లో చేరి టికెట్ తెచ్చుకున్నారు. అక్కడ రెండు సార్లు పోటీ చేసి ఓడిన బీజేపీ రఘునందనరావుకి అవకాశాలు బాగానే ఉన్నాయి. అందరి కంటే ముందే ఈయన ప్రచారం స్టార్ట్ చేశారు. రెండు సార్లు ఓడారన్న సానుభూతి, బీజేపీ పెద్దల అండ కలిసి వస్తున్నాయి. ఈ సారి ఎలా అయినా గెలవాలి అంటే “టీఆరెస్ వ్యతిరేక ఓట్లు చీలకూడదు. అంటే కాంగ్రెస్ కి పడాల్సిన ఓట్లు కూడా తనకే పడితే గెలుపు సులువే”..! అందుకే ఈ కథ నడిచినట్టు చెప్పవచ్చు. కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ… టీఆరెస్ ని ఓడించడానికి అంతర్గతంగా మాత్రం బీజేపీకే మద్దతు అనే ఒక పద్ధతికి తెరతీయడంలో ఆశ్చర్యం లేదు. టీఆరెస్ గ్రేటర్ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తుంది. కానీ దుబ్బాకలో ఓడిస్తే… ఆ రాష్ట్రం మొత్తం మీద ఎంతో కొంత పతనం ఆరంభమవుతుంది. అందుకే “బలమైన ప్రత్యర్థి బలం తగ్గించడం కోసం.. ఇద్దరు ప్రత్యర్ధులు కలవడం” పెద్ద విషయమేమి కాదు. ఇదీ టీఆరెస్ పై ఈ రెండు పార్టీల కుట్రగా చెప్పుకోవచ్చు..! ఏమో ఇలా జరగవచ్చు..! చెప్పలేం..!!

Related posts

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju