NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

జర్నలిస్ట్ నుండి చట్టసభకు..! కష్టం..కన్నీరు తెలిసిన రఘు..!!

 

అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, తన లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అంకుటిత దీక్ష, పట్టుదలతో  కృషి చేశారు దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందనరావు.  చట్టసభలోకి అడుగు పెట్టాలన్న తన ఆకాంక్ష, కోరిక మూడవ ప్రయత్నంలో సఫలం చేసుకున్నారు. ఈ సందర్భంగా రఘునందనరావు ఎమ్మెల్యేగా గెలుపొందే వరకూ ఆయన వివరాలు క్లుప్తంగా..

జర్నలిస్ట్‌గా ప్రస్థానం ప్రారంభించి..

మెదక్ జిల్లాలో 1968 మార్చిలో జన్మించిన రఘునందనరావు .. సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్శిటీ నుండి ఎల్ఎల్‌బీ, కర్నాటక విశ్వ విద్యాలయం నుండి బీఈడీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుండి మానవహక్కులలో పీజీ డిప్లొమా పూర్తి చేశారు.  విద్యాభ్యాసం అనంతరం రఘునందనరావు 1991ల తన మకాంను సిద్దిపేట నుండి  హైదరాబాద్ లోని పటాన్‌చెరువు ప్రాంతానికి మారారు. అయిదేళ్ల పాటు ఒక ప్రముఖ దిన పత్రికకు విలేఖరిగా పని చేశారు. ఆ తదుపరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా  పని చేశారు. ఆ కాలంలో ఎంఐఎం నేత, హైదరాబాద్ ఎంపి అసదుద్దీన్ ఒవైసీకి న్యాయవాదిగా వివిధ కేసుల్లో వ్యవహరించారు.

టీఆర్ఎస్‌తో రాజకీయ అరంగ్రేటం

రఘునందనరావు 2001లో టీఆర్ఎస్‌ పార్టీలో చేరారు. తన వాగ్దాటి, నాయకత్వ పటిమతో కార్యకర్త నుండి నాయకుడిగా ఎదిగారు. మెదక్ జిల్లా అధ్యక్షుడుగా, టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడుగా పని చేశారు. కేసిఆర్ కుటుంబానికి దగ్గర బంధువు అయినప్పటికీ హరీష్ రావుతో విబేధాల కారణంగా పార్టీ నుండి బహిష్కరించారని టాక్. 2013లో టీడీపీ అధినేత చంద్రబాబు ను కలిశారన్న ఆరోపణపై రఘునందనరావును  టీఆర్ఎస్ నుండి సస్పెండ్ చేశారు.  అయితే ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. టీఆర్ఎస్ ‌నుండి సస్పెండ్ అయిన తరువాత రఘునందనరావు బీజేపీలో చేరారు.

పట్టువదలని విక్రమార్కుడిలా

దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2014 ఎన్నికల్లో ఆ తరువాత  2018 ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థిగా రఘునందన రావు  పోటీ చేశారు.  నాడు ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు రఘునందనరావు. మూడవ స్థానానికి పరిమితం అయ్యారు. 2014 ఎన్నికల్లో 15,131 ఓట్లు సాధించిన రఘునందనరావు, 2018 ఎన్నికల్లో మరో ఆరు వేల పైచిలుకు ఓట్లు ఎక్కువగా 22,595 ఓట్లు మాత్రమే పొందారు. ఆ రెండు పర్యాయాలు టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట రామలింగారెడ్డి ఇక్కడ నుండి విజయం సాధించారు. రెండవ సారి ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి అకాల మరణంతో దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. ఇదే నియోజకవర్గం నుండి రెండు సార్లు ఓటమి పాలైనా నిరుత్సాహ పడకుండా ఓర్పు నేర్పుతో నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని ఉన్నారు రఘునందనరావు. ఈ సారి ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి భార్య సోలిపేట సుజాతను నిలిపి గెలుపు బాధ్యతలను మంత్రి హరీష్ రావు  స్వీకరించి అన్నీ తానే అయి వ్యవహరించారు. అయినప్పటికీ రఘునందనరావు  ఏమాత్రం భయపడకుండా నామినేషన్‌ల ప్రక్రియ ప్రారంభం కాకముందు నుండే నియోజకవర్గంలోని గ్రామాలు అన్నీ ఒక సారి చుట్టేశారు. ప్రజల కష్టాలు, బాధలు వింటూ రెండు సార్లు తిరస్కరించారు ఈ సారి అయినా అవకాశం ఇవ్వండి అంటూ ఊరుఊరు తిరిగారు. గడపగడప ఎక్కారు. ఓట్లు అభ్యర్థించారు. ఆయన కష్టం ఫలిచింది. వెయ్యి ఓట్లకు పైగా ఆధిక్యతతో దుబ్బాక ఎమ్మెల్యేగా విజయం సాధించారు రఘునందనరావు.

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju