NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

రైతు ఉద్యమం దేశమంతా వెళ్లబోతుందా? : బీజేపీ కి తలనొప్పి తప్పదా

 

లక్షలాది మంది రోడ్డు మీదనే…. వారికీ కొన్ని రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులు…. కట్టుకునేందుకు బట్టలు…. అవసరం అయ్యే వైద్య సదుపాయాలు… వారంతా ఏదో యుద్ధం కోసం సన్నద్ధమయ్యేలా కనిపిస్తున్నారు… బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద సంగ్రామానికే తరలి వస్తున్నట్లు ఉంది.

వంతుల వారీగా

పంజాబ్ హర్యానా రైతులు చేపట్టిన ఉద్యమం వారం దాటింది. అయినా వెల్లువల ట్రాక్టర్లు వస్తూనే ఉన్నాయి డిల్లీ వాళ్లని ఇప్పటికే రైతులతో కిక్కిరిశాయి. సుమారు 5 లక్షల మంది వరకు ఉండొచ్చని ఓ అంచనా. మీరంతా వంతుల వారి విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ రైతు ఉద్యమంలో ఉంటే అతని తాలూకా పొలాన్ని స్థానికంగా ఉండే మిగిలినవారు సంరక్షించే ఏర్పాట్లు చేసుకున్నారు. కొందరు వంతుల వారీగా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఒక గ్రూపుగా ఏర్పడి ఆ గ్రూపులోని సభ్యులు మూడు నాలుగు రోజులకు మారుతూ తమ స్వగ్రామానికి వెళ్లి మళ్ళీ తిరిగి ఢిల్లీ శివార్లకు వస్తున్నారు. రైతుల సన్నద్ధత చూస్తే ఉద్యమం కొన్ని నెలలే అయినా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

నిధులు ఎలా?

ఇంత పెద్ద ఉద్యమానికి నిధులు ఎలా సమకూరుతున్నాయి అనేది ప్రధాన ప్రశ్న. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇంటెలిజెన్స్ వర్గాలు దీనిపై కూపీ లాగుతున్నారు. అయితే రైతుల్లో ఎక్కువ మంది సొంత డబ్బులు లేదా గ్రామస్తులంతా కలిసి వేసుకున్న డబ్బులు తీసుకొని ఢిల్లీ శివార్లకు వస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాక్టర్లకు డీజిల్ కి అయ్యే ఖర్చులను ఆ ట్రాక్టర్ పై వచ్చే వారంతా వేసుకుంటున్నారు.
* మరోపక్క ఎన్నారై నిధులు రైతులకు అందుకున్నట్లు తెలుస్తోంది. వీటిని విదేశాల్లో ఉన్న వారు స్వచ్ఛందంగా అందిస్తున్నారు లేక ఏదైనా పార్టీ సంస్థల ప్రమేయం తో రైతులకు ఇస్తున్నారా అనేది అంతుబట్టడం లేదు. దాదాపు ఎక్కువ మంది రైతులకు విదేశాల నుంచి విరివిగా విరాళాలు వస్తున్నాయి. వారి తిండి బట్ట కోసమే కాకుండా ట్రాక్టర్లలో డీజిల్కు అయ్యే డబ్బును సైతం విదేశీ ఎన్నారైలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారంపై కేంద్రం దృష్టి పెట్టింది. విరాళాలు ఇస్తున్నది ఎవరు వారి వెనుక ఉన్నది ఎవరు అనే విషయాలను కూపీ లాగుతున్నారు. మరో పక్క ఉద్యమానికి కొన్ని రాజకీయ పార్టీల ప్రోద్బలం ప్రోత్సాహం ఆర్థిక సహకారం ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.

విస్తరించే వ్యూహం

రైతు ఉద్యమాన్ని దేశమంతా విస్తరించాలని రైతు సంఘాల నాయకులు భావిస్తున్నారు. ఈ ఆందోళనకు ఆరు రైతు సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. వీరిలో కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి. అయితే రైతుల ఉద్యమ నడిపించే విషయంలో మాత్రం వీరంతా ప్రస్తుతం ఒకే మాట మీద ఉన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తోమర్, అమిత్ షా ల తో చర్చించేందుకు కొన్ని సంఘాలు ఒప్పుకున్నా, మరికొన్ని మాత్రం వ్యవసాయ చట్టం వెనక్కు తీసుకునే వరకు ఉద్యమం చేస్తామని చెబుతున్నాయి. అయితే ఉద్యమాన్ని దేశమంతా విస్తరించేందుకు రాజకీయ పార్టీల సహకారం తీసుకోవాలని కొన్ని సంఘాలు చెబుతుంటే, మరి కొన్ని సంఘాలు మాత్రం రాజకీయ పార్టీల వస్తే ఉద్యమం నీరుగారుతుందని చెబుతున్నాయి. ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ఉన్న మార్గాలనూ రైతు సంఘాల నాయకులు ఆలోచిస్తున్నారు. దీన్ని కేంద్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. రైతు సంఘాల నాయకుల ఆక్టివిటీస్ వారి కదలికలపై ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ అధికారులు నిఘా పెట్టారు.

చర్చలు జరుగుతాయా

రైతు సంఘాల నాయకులు, కేంద్ర ప్రభుత్వ పెద్దల మధ్య చర్చల ప్రతిష్టంభన కొనసాగుతోంది. రైతు సంఘాల లో కొన్ని చర్చలకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తే మరికొందరు చట్టం వెనక్కి తీసుకుంటామని హామీ ఇచ్చిన తర్వాతే చర్చలు జరిపితే బావుంటుందని వాదిస్తున్నారు. కేవలం రైతు సంఘాల నాయకులు కొందరు మాత్రమే ఢిల్లీ లోపలికి రావాలని చెప్పడం వివాదానికి దారి తీసింది. కేంద్ర ప్రభుత్వ పెద్దలే రైతుల వద్దకు రావాలని వాదులాట తో చర్చలు ముందుకు సాగడం లేదు. అయితే బుధవారం మరోసారి కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాట్లాడుకొని రైతుల్ని చర్చలకు కొన్ని సార్లు తెరపై ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీన్ని రైతు సంఘాల నాయకులు ఒప్పుకుంటారా లేక ఉద్యోగం ఇలాగే కొనసాగుతుంది అనేది తెలియడం లేదు.

Related posts

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N