NewsOrbit
Featured న్యూస్ బిగ్ స్టోరీ

ఢిల్లీలో జగన్ – కేసీఆర్..! అమిత్ షా పెద్ద షాకే ఇవ్వబోతున్నారు..!?

ఢిల్లీలో ఏదో జరుగుంది. లేకపోతే తెలంగాణ సీఎం కేసీఆర్ ని పిలవడం ఏంటి..? ఆ వెంటనే ఏపీ సీఎం జగన్ కి పిలుపు రావడం ఏంటి..? ఇప్పుడు మళ్ళీ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కి ఎల్లుండి అపాయింట్మెంట్ ఇవ్వడం ఏంటి..? కేంద్రంలో ఒక కదలిక మొదలయింది. వ్యవసాయ బిల్లులపై దేశ వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న వేళ… రెండు రోజుల్లో దేశం మొత్తం ఉద్యమం ఉదృతం చేయాలని నిర్ణయించిన వేళ.. అమిత్ షా ఇలా వరుసగా సీఎంలను పిలిపించుకుని మాట్లాడుతుండడం మాత్రం గమనించాల్సిన అంశమే..! రైతుల ఉద్యమాలు అనుకూలంగా నిర్ణయాలు మార్చుకుంటున్న సీఎంలుతో అమిత్ షా ఒక క్లాస్ తీసుకుంటూనే, వారి అభిప్రాయాలు తీసుకుని బిల్లులకు సంస్కరణలకు ఆలోచిస్తున్నట్టు సమాచారం. 

రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది – కేంద్రం ఏం చేయాలి..!?

ఎస్..! బీజేపీ ఇప్పుడు తెలుసుకోవాల్సిన కీలక అంశం ఇదే. రైతులు చేస్తున్న ఉద్యమం క్షేత్రస్థాయిలో ఎలా ఉంది..? ఎంత మేరకు మద్దతు లభిస్తుంది..? ఎంత మేరకు రైతులు పాల్గొంటున్నారు..? అనే అంశాలు కావాలి. ఇవి తెలుసుకోవడం సులువే. కేంద్రానికి ఉన్న ప్రత్యేక నిఘా సంస్థలు ద్వారా తెలుసుకుంటారు..! కానీ రాజకీయం ఎంత మద్దతు ఉంది..? ఏ పార్టీలు ఎలా మద్దతు ఇస్తున్నాయి..? ఏ పార్టీల ఉద్దేశం ఏమిటి..? రాష్ట్రాల అధికార పార్టీల వైఖరి ఎలా ఉంది అనేది మాత్రం బీజేపీ తెలుసుకోలేదు. బిల్లు ప్రవేశ పెట్టక ముందు చేయలేదు. తీరా దేశం మొత్తం ఉద్యమం జరిగి, ఇప్పుడు కొంప కొల్లేరయ్యే పరిస్థితి వస్తుండడంతో ఇప్పుడిప్పుడే కేంద్రం అలెర్ట్ అయింది. బిల్లు ఆమోదానికి ముందే సీఎంలను కాకాపట్టడమో, బెదిరించడమో చేయాల్సిన కేంద్రం ఇప్పుడు ఆ పని చేస్తుంది. అందుకే ఈ వరుస పిలుపులు. రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి..? కేంద్రం ఏం చేయాలి..? అనేది నిర్ధారించుకునే క్రమంలో ఈ పిలుపులు.

రైతులతోనూ మరో దశలో..!!

ఢిల్లీలో రైతుల ఉద్యమం తీవ్రమవుతుంది. కేంద్రం వారితో చర్చలకు సిద్ధమవుతోంది. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతు సంఘాలు తమ వాణిని మరింత బలంగా వినిపించడానికి సిద్ధమవుతున్నాయి. చట్టాలను పూర్తిగా రద్దు చేయాల్సిందే అంటూ పట్టుపడుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం బుధవారం దిల్లీ-నోయిడా మధ్య చిల్లా సరిహద్దును పూర్తిగా స్తంభింపజేస్తామని ప్రకటించాయి. ‘చట్టాలను రద్దు చేసేది లేదని కేంద్రం చెబుతోంది. ప్రభుత్వం వాటిని రద్దు చేసేలా చేస్తామని మేం చెబుతున్నాం. ఉద్యమం అలాంటి దశకు చేరింది’ అని రైతుల నేత జగ్జీత్‌ దల్లేవాల్‌ చెప్తున్నారు. ప్రభుత్వం తమ డిమాండ్లు విని, నిర్దిష్ట ప్రతిపాదనలతో ముందుకు రావాలని కోరుతున్నారు. రైతులకు మద్దతుగా దాదాపు 2000 మంది వరకు మహిళలు దిల్లీ సరిహద్దులకు రాబోతుండగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన కుల సంఘాల (ఖాప్‌ పంచాయతీల) అధ్యక్షులు ఈ నెల 17న ఉద్యమ స్థలానికి చేరుకోనున్నారు.

secret agenda between amith shah and jagan meet
secret agenda between amith shah and jagan meet

సీఎంల సలహాలతో కొత్త సంస్కరణలు..!?

ఈ ఉద్యమం తీవ్రత కాకమునుపే.. బీజేపీ ఒక ప్రతిపాదనలు సిద్ధం చేస్తుంది. గతంలో మొండి పట్టుదలతో.., ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్న కేంద్రం ఈసారి జాగ్రత్తలు పడుతుంది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు ఉండడం, తమిళనాడులో కూడా బీజేపీకి ఊపు కావాల్సి ఉండడం… ఎన్నికల వేళ ఈ గోల ఎందుకు అనుకుంటున్న బీజేపీ పెద్దలు వీటిని సంస్కరణలు చేయడానికి సిద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా కొందరు సీఎంలు, కీలక రాజకీయ, వ్యవసాయ నిపుణులతో దశల వారీగా చర్చిస్తున్నారు. ఈ సలహాలకు అనుగుణంగా.. రైతుల వద్ద తమ తుది ప్రతిపాదనలు పెట్టనున్నారు. అందుకే ఈ వరుస భేటీలు, వరుస పిలుపులు..!!

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju