కరోనా నేపథ్యంలో దేశవ్యాప్తంగా మూతబడ్డ థియేటర్లు ఇప్పుడిప్పుడే తిరిగి తెరుచుకుంటున్నాయి. అన్నీ నిబంధనలను పాటిస్తూ సినిమా థియేటర్లు తెరుస్తామని అందుకు అనుమతి ఇవ్వమని థియేటర్ ఓనర్లు ప్రభుత్వాన్ని అడగగా ప్రభుత్వం అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల సినిమా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ప్రజలలో కరోనా భయం మాత్రం ఇంకా వెంటాడుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో తెలుగు సినీ నిర్మాతలు అందరూ సంక్రాంతి సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని సినిమా రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థుతులలో చిన్న సినిమా లేదా పెద్ద సినిమా అయినా బాక్సాఫీస్ వద్ద విజయవంతం కావడం ఎంతో ముఖ్యం. అందుకు సంక్రాంతిస్ సీసన్ సరైనది.
ఇలా సంక్రాంతి కి విడుదల కానున్న సినిమాల లిస్ట్ లో మాస్ మహారాజ్ రవితేజ నటించిన ‘క్రాక్’ కూడా ఉంది. తాజాగా, ఈ సినిమా రిలీజ్ డేట్ ను Jan 14 న విడుదల చేయుటకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు తెలుస్తుంది.
‘క్రాక్’ రిలీజ్ డేట్ ను సంగీత దర్శకుడు SS థమన్ ట్వీట్ చేస్తూ తెలిపారు. దానిని సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని రీట్వీట్ చేస్తూ #KRACKONJAN14’th అనే హ్యాష్‌ట్యాగ్‌ను ఉపయోగిస్తూ ఈ విషయం స్పష్టం చేశారు.
“#KRACK BGM WORKS & #PostProduction ON FULL SWING, #KRACKONJAN14’th హాష్ టాగ్స్ తో ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను కూడా త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం.. ప్రస్తుతం సినిమా రిలీజ్ కు సంబంధించిన పోస్ట్-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నట్లు తమన్ ట్వీట్ చేశారు. ఇది సినీమా ప్రేమికులకు ఒక విందు కానున్నది.
కాబట్టి వచ్చే సంక్రాంతికి ‘క్రాక్’ సినిమా థియేటర్లలో సందడి చేయనున్నది. ఇది ఒక కాప్ డ్రామా నేపథ్యంలో సాగే చిత్రం. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మరియు రెండు పాటలు సోషల్ మీడియా లో అందరి మెప్పును పొందాయి.