NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏపీ స్థానిక ఎన్నికల వివాదం : జగన్ ముందు మూడంటే మూడే ఆప్షన్లు…

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సర్కారుకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య నడుస్తున్న వివాదం గురించి ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. ఇక ఈ సుదీర్ఘ పోరాటంలో ఎవరు ముందంజలో ఉన్నారు అంటే…

 

పంతం నీదా… నాదా సై….!

తన అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి ఏపీ సర్కారు ఎంతకైనా తెగిస్తుంది. దానిని భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ హైకోర్టు జారీ చేసిన తాజా ఆదేశాల ప్రకారం ఏపీ సర్కార్ కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఒక పెద్ద పరీక్ష పెట్టింది అని చెప్పాలి. స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్న ఈ విషయంపై వీరిద్దరి మధ్య భారీ వివాదం జరుగుతోంది. గతంలో కరోనా పేరు చెప్పి నిమ్మగడ్డ రమేష్… ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎన్నికల వాయిదా వేయగా ఇప్పుడు ప్రభుత్వం అదే సాకుతో ఎన్నికలు జరిగే ప్రసక్తే లేదు అని అంటోంది.

జగన్ తగ్గాలా.. ?

ఇలాంటి వేళ ఎన్నికల వాయిదా కొరకు హైకోర్టు ను సందర్శించిన ఏపీ సర్కారు కి న్యాయస్థానం ఇదే విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు లేఖ రూపంలో రాయాలని చెప్పింది. ప్రభుత్వం వినతిపత్రాన్ని ఎన్నికల సంఘం పరిశీలిస్తుందని పేర్కొంది. ఇక వారిద్దరి మధ్య ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏపీ సర్కార్ లేఖ రాసేందుకు సముఖంగా లేదు అనే చెప్పాలి. వారి మధ్య సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇప్పటికే పలుమార్లు వాగ్వాదం చోటు చేసుకోగా ఎన్నికల కమిషనర్ కు లేఖ రాసేందుకు ఏమాత్రం సిద్ధం అవుతారో చూడాలి.

తగ్గే ప్రసక్తే లేదా?

దీనిపై కోర్టులకు తిరిగి తిరిగి అయిపోయింది స్థానిక ఎన్నికలు నిర్వహించవద్దన్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ కి అభ్యర్థించింది అంతేకాకుండా కేంద్రం సూచించినట్లు వ్యాక్సిన్ వేసేందుకు కూడా పోలీసు బలగం, ఇతర డిపార్ట్‌మెంట్ల సహకారం కావాలని అదే సమయంలో ఎన్నికలు నిర్వహించడం కుదరదని ఏపీ సర్కార్ చెబుతోంది. మరి తమను ఎన్నికల కమిషనర్ గుర్తించడం లేదు కాబట్టి తాము కూడా లేఖ రాసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం లేదని అంటున్నారు.

మరి హైకోర్టు ఆదేశాలపై మరొకసారి సర్కారు పిటిషన్ దాఖలు చేస్తుందా…? లేదా అత్యున్నత న్యాయస్థానం చెప్పినట్లు వింటుందా? లేదా రెండింటికి భిన్నంగా సుప్రీంకోర్టు వరకు వెళుతుందా… అన్నది ఇక్కడ ప్రశ్న. మొత్తానికి ఈ అంశం రోజుకో మలుపు తిరుగుతూ ఉన్నట్లు అనిపించినా అక్కడే తిరుగుతూ ఉంది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju