NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

GHMC Mayor : టీఆరెస్-బీజేపీ మధ్యలో ఎంఐఎం..! వహ్వా.. గ్రేటర్ లో నయా గేమ్..!!

GHMC Mayor : టీఆరెస్-బీజేపీ మధ్యలో ఎంఐఎం..! వహ్వా.. గ్రేటర్ లో నయా గేమ్..!!

GHMC Mayor : టీఆర్ఎస్ బీజేపీ.. మధ్యలో ఎంఐఎం..! ఇదేదో సినిమా టైటిల్ లా అనిపించినా ప్రస్తుతం ఈ పార్టీలను ఇలానే ఉచ్చరించాలి తప్పదు.జీహెచ్ఎంసీ మేయర్ GHMC Mayor  ప్రస్తుతం రాజకీయ సమీకరణాలు అలా మారిపోయాయి మరి. ఎందుకంటే నీతులు చెప్పడానికే.. పాటించడానికి కాదు, సూక్తులు చదవడానికే.. ఆచరించడానికి కాదు. వాడుకలో ఉన్న ఈ నీతి సూత్రాలన్నీ మన రాజకీయ నాయకులకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి.

ఎవరెప్పుడు ఎటు వెళ్తారో, ఏ పార్టీలో ఉంటారో.. ఎవరికి మద్ధతిస్తారో.. అన్నింటికీ మించి ఎవరిని ఎప్పుడు తిడతారో ఎవరికీ తెలీదు. ఇదంతా ఇప్పుడు ప్రత్యేకించి చెప్పుకోవడానికి కారణమైన పార్టీలు టీఆర్ఎస్-ఎంఐఎం. గత ఏడాది జరిగిన బీహార్, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు ఆడిన మూడు ముక్కలాట ఇది. అప్పట్లో తిట్టుకుని ఇప్పుడు కలిసిపోయారు. ఎవరో.. ఏంటో.. ఎందుకో చదవండి..

MIM political game with bjp and trs GHMC Mayor
MIM political game with bjp and trs GHMC Mayor

GHMC Mayor : రాజకీయ నానుడిని నిజం చేసేలా..

‘రాజకీయాల్లో శాస్వత శత్రువులు.. శాస్వత మిత్రులు ఉండరు..’ చత్రపతి సినిమాలో కోట శ్రీనివాసరావు డైలాగ్ ఇది. రాజకీయాల్ని చూసేవారికి.. అందులో ఉన్న వారికి ఇది తెలిసిన విషయమే. స్వయంగా చంద్రబాబు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నట్టు అన్నమాట. సగటు మనిషి ఊహించలేని రాజకీయ ఆట ఇది. ఈస్థాయి పెర్ఫార్మెన్సే ఎంఐఎం చేసింది. అదీ ముసుగులో. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్రంగా పోటీ చేసి 5 సీట్లు గెలుచుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడ్డ మహా ఘట్ బంధన్ కు షాక్ ఇస్తూ.. ఎంఐఎంతో కలిసి బీజీపీ ఆడిన గేమ్.. అంతా పూర్తయ్యకే తెలిసింది. బీజేపీతో-జనతాదళ్ కు ఎంఐఎం ఓట్లు చీల్చిపెట్టి మహా ఘట్ బంధన్ కు అధికారం దూరం చేసి బీజేపీ కూటమికి అధికారం అప్పగించింది. పైకి బీజేపీతో ఢీ.. లోపల బీజేపీతో దోస్తీ. ఇదే స్ట్రాటజీని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం మళ్లీ చేసింది. ఏకంగా మతపరమైన అంశాలని ప్రచారంలో తీసుకొచ్చి బీజేపీతో నువ్వా నేనా అనేంత వరకూ వెళ్లింది హైదరాబాద్ లో. మొత్తంగా ఎన్నికల్లో బీజేపీకి సాయం చేసి.. ఇప్పుడు మళ్లీ టీఆర్ఎస్ కు సాయం అందించింది. అదెలా అంటే..

బీహార్, హైదరాబాద్ లో ఇలా..

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం, బీజేపీ నేతలు దూషించుకున్న తీరు చూస్తే.. మళ్లీ హైదరాబాద్ ఏమైపోతుందో.. ఏం జరుగుతుందో అనే అనుకున్నారు అంతా. అంతలా మాటల దాడి జరిగిపోయింది. అయితే.. ఇదంతా వీరిద్దరూ కలిసి ఆడిన గేమ్ అని తెలుసుకోవడానికి కాస్త సమయమే పట్టింది. మతపరమైన ఓట్లు ఎవరివ వారికి వచ్చేట్టు.. ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ముస్లిం ఓట్లు ఎలానూ ఎంఐఎంకే వెళ్తాయి. అయితే.. హిందూ ఓట్లు చీల్చడమే లక్ష్యంగా మతపరమైన అంశాల్ని తీసుకొచ్చి వాటిని బీజేపీ ఢీకొట్టినట్టు చూపారు. దీంతో హిందూ సెంటిమెంట్ రగిలి బీజేపీకి, ముస్లిం సెంటిమెంట్ రగిలి ఎంఐఎంకు ఓట్లు పడ్డాయి.. సీట్లు పెరిగాయి. ఇద్దరికీ లాభమే జరిగింది. అయితే.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం నుంచీ టీఆర్ఎస్ తో మైత్రి కొనసాగించిన ఎంఐఎం మాత్రం కాస్త ఎదగాలని చూసి బీజేపీతో సావాసం చేసింది. ఇక్కడ టీఆర్ఎస్ ను వదులుకోలేదు.. అక్కడ బీజేపీని కాదనలేకుండా ప్లాన్ ప్రకారంగా ఎదిగింది.

రెండు చోట్ల గ్రిప్.. వాట్ ఏన్ ఐడియా

ఇక్కడ టీఆర్ఎస్ తో బంధం ఏంటో ఈరోజు నిరూపణ అయింది. ప్రతిష్టాత్మక జీహెచ్ఎంసీ మేయర్ పీఠం కోసం టీఆర్ఎస్, బీజేపీ పోటీ పడ్డాయి. మొత్తంగా కె.కేశవరావు కుమార్తె టీఆర్ఎస్ కార్పొరేటర్ గద్వాల విజయలక్ష్మి, మరో టీఆర్ఎస్ కార్పొరేటర్ మోతె శ్రీలత డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికయ్యారు. మొత్తంగా రెండు పదవుల్లో బీజేపీకి ఒక్కటీ దక్కలేదు. ఇక్కడ మళ్లీ చక్రం తిప్పింది ఎంఐఎం. మేయర్ ఎన్నికల ముందు, ఎంఐఎం వంటి ఇస్లామిక్ మతోన్మాద మతతత్వ పార్టీ మాకు పొత్తు లేదని.. ఉంటే నిరూపించాలని సవాలు చేసింది. కానీ.. జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల విషయంలో ఎంఐఎం మద్దతు తీసుకుని మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు పొందింది. దీంతో ఎంఐఎం గేమ్ అందరికీ క్లియర్ అయింది.

కేంద్రంలో బీజేపీతో తగువు లేకుండా.. రాష్ట్రంలో టీఆర్ఎస్ తో తెగతెంపులు లేకుండా అధికార పార్టీలతో పావులు కదిపి ఎక్కాలనుకున్న మెట్టు ఎక్కింది.. బీహార్లో బీజేపీని పట్టు తప్పనివ్వకుండా చక్రం తిప్పింది.. జీహెచ్ఎంసీలో పట్టు కోల్పోకుండా మేయర్ పీఠంపై టీఆర్ఎస్ ను కూర్చోబెట్టింది. మొత్తంగా మూడు ముక్కలాట ఆడేసింది. విపక్షాల వాగ్భాణాలు ఎంఐఎం, టీఆర్ఎస్ పై వస్తున్నా.. మరో అయిదేళ్ల వరకు వీరికి అవి కనబడవు.. వినబడవు.

 

 

Related posts

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N