NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

APS RTC : ఏపిఎస్ ఆర్‌టీసీ ఎంత నష్టాల్లో ఉందా తెలుసా..?

APS RTC : ఏపిఎస్ ఆర్‌టీసీ చాలా కాలంగా నష్టాల్లో నడుస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటం ఆర్‌టీసీకి మరింత భారం అవుతోంది. లీటర్ డీజిల్‌కి ఒక్క రూపాయి పెరిగితే నెలకు ఎకంగా రూ.2.4 కోట్ల అదనపు భారం పడుతుంది. ఆర్‌టీసీ కార్మికులకు బకాయిలను చెల్లించలేని పరిస్థితిలో ఉంది. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టాల్లో ఉన్న ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేస్తుండేవారు. అయితే ఆర్‌టీసీ భారీ నష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ఆర్‌టీసీ కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు సంస్థను ప్రభుత్వంలో విలీనం చేశారు. తెలంగాణలో అక్కడి ఆర్‌టిసీ కార్మికులు ఇదే డిమాండ్ చేసినా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పేశారు. ఏపి సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని కెసిఆర్ తప్పుబట్టారు. కానీ ఏపి సీఎం జగన్ మాత్రం ఇచ్చిన హామీ మేరకు ఆర్‌టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆర్‌టిసి కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు మాదిరిగానే అన్ని సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.

APS RTC in losses
APS RTC in losses

ప్రస్తుతం ఏపిఎస్ ఆర్‌టీసీ రూ.6వేల కోట్ల నష్టాల్లో ఉంది. ఈ విషయాన్ని ఆర్‌టీసీ ఎండి ఆర్పీ ఠాకూర్ స్వయంగా వెల్లడించారు. నేడు తూర్పు గోదావరి జిల్లాలో ఆయన మీడియా మీట్ నిర్వహించారు. డీజిల్ ధరలు పెరిగినందున ఇంధనం పొదుపు చాలా అవసరమని అన్నారు. ఆర్‌టీసీలో ఖర్చులు తగ్గించడంతో పాటు సిబ్బంది కష్టపడి పని చేసి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా హామీ ఉద్యోగులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంలోనే ఆర్‌టీసీ కార్గో సిబ్బంది తమ సమస్యలపై ఠాకూర్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కార్గో సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆర్పీ ఠాకూర్ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని వెల్లడించారు.

APS RTC in losses
APS RTC in losses

 

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో కూటమి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju