NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Nagarjuna Sagar : సాగర్ పై కాంగ్రెస్ ధీమా..! జాగ్రత్తగా అడుగులేస్తున్న టీఆర్ఎస్, బీజేపీ..!!

nagarjuna sagar by election raising heat

Nagarjuna Sagar: నాగార్జునసాగర్ Nagarjuna Sagar ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక్కడ గెలిచి పట్టు నిలుపుకోవాలని టీఆర్ఎస్, పూర్వ వైభవం తెచ్చుకోవాలని కాంగ్రెస్, దుబ్బాక ఉప ఎన్నిక దూకుడు ఇక్కడా చూపించాలని బీజేపీ.. ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఎన్నిక కంటే పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్ధులే చర్చనీయాంశం అవుతున్నారు. నామినేషన్ కు రేపు ఒక్కరోజే ముందు టీఆర్ఎస్ అభ్యర్ధిని ప్రకటించింది. ఇంతవరకూ బీజేపీ అభ్యర్ధిని ప్రకటించలేదు. మరోవైపు కాంగ్రెస్ కు ఈ విషయంలో పెద్దగా శ్రమ పడలేదు. జానారెడ్డి రూపంలో బలమైన అభ్యర్ధి ఉండటం వారికి కలిసొచ్చింది. ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాలో కాంగ్రెస్ ఉంది.

nagarjuna sagar by election raising heat
nagarjuna sagar by election raising heat

అయితే.. బీజేపీ ఇంకా అభ్యర్ధిని ప్రకటించకపోవడం చర్చనీయాంశమైంది. బలమైన అభ్యర్ధులు, సామాజికవర్గం సమీకరణ, గెలుపోటములపై విశ్లేషణలతోనే ఇప్పటివరకూ గడిపేశారు. నిజానికి సాగర్ లో టీఆర్ఎస్ మంత్రులు, కొందరు పెద్దలు నెల రోజుల క్రితం నుంచే ఇక్కడ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసారు. నోముల నర్సింహులు బీసీ నేత కావడంతో అదే సామాజికవర్గ నేతకు టికెట్ ఇవ్వాలా.. కాంగ్రస్ నుంచి జానారెడ్డి ఉండటంతో రెడ్ల వర్గానికి చెందిన వారికి టికెట్ ఇవ్వాలా అనే ఆలోచించి నోముల నర్సింహులు తనయుడు నోముల భగత్ కే టికెట్ ఇచ్చింది. మరోవైపు బీజేపీది మరో కథ. అధిష్టానం ఇంకా అభ్యర్ధిని ఖరారు చేయకపోయినా స్థానిక బీజేపీ ఇంచార్జి కంకనాల నివేదితారెడ్డి నామినేషన్ వేయడం సంచలనం రేపుతోంది. పార్టీ కోసం తానెంత కష్టపడ్డానో అందరికీ తెలుసు అనే ధీమాతో ఆమె ఉన్నారు.

 

ఇన్ని అంశాల నేపథ్యంలో నాగార్జున సాగర్ ఉపఎన్నిక అంశం హీటెక్కిపోయింది. ‘అందరం నామినేషన్లు వేసి ఇంట్లో కూర్చుందాం.. ఎవరు గెలుస్తారో చూద్దాం..’ అని జానారెడ్డి సవాల్ చేయడం సంచలనం రేపుతోంది. దీంతో టీఆర్ఎస్ సైతం ఆలోచించే పరిస్థితి తలెత్తింది. గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్ఎస్ గెలిచిన పరిస్థితులు ఇప్పుడక్కడ లేవని.. ప్రభుత్వ వ్యతిరేకత ఉందని కాంగ్రెస్ అంటోంది. తెలంగాణలో మేమే ప్రత్యామ్నాయం.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఫలితాలే ఇక్కడా వస్తాయని బీజేపీ భావిస్తోంది. టీఆర్ఎస్ మాత్రం గతం మాదిరిగా ఢంకా భజాయించడం లేదు. ఆచితూచి అడుగులు వేస్తోంది. నామినేషన్ ముందువరకే ఇంత ఆసక్తి రేకెత్తించిన సాగర్ ఉప ఎన్నికలో గెలుపు ఎవరికి దక్కుతుందో చూడాలి.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

బ‌ల‌మైన నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌ల‌హీన నేత‌లు.. వైసీపీ సాధించేదేంటి..?

దెందులూరులో మా ఓడికి ఓట‌మే నో డౌట్‌… వైసీపీ లీడ‌ర్లే ఒప్పేసుకుంటున్నారే..?

ఏపీలో మేనిఫెస్టో జోష్ తుస్‌.. ఇంత షాక్ ఇచ్చారేంట‌బ్బా…?

పింఛ‌న్లు-ప‌రేషాన్లు.. వైసీపీ ఉచ్చులో టీడీపీ.. !

BRS: బీఆర్ఎస్ కు మరో షాక్ .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న మరో కీలక నేత

sharma somaraju