NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Nagarjuna Sagar Bypoll : నాగార్జునసాగర్ లో ఓసీ బీసీ ఎస్టీ ల మధ్య రంజైన పోటీ!కుల ప్రాతిపదికన టిక్కెట్ల కేటాయింపు!ఇదో కొత్తరకం ప్రయోగం!

BJP Telangana: Serious plan behind the Politics

Nagarjuna Sagar Bypoll : నాగార్జునసాగర్ సిట్టింగ్ సీటును కాపాడుకునేందుకు అధికార టీఆర్‌ఎస్.. దుబ్బాక ఫలితాన్ని రిపీట్ చేయాలన్న కసితో కమలదళం ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన సీనియర్ నేత జానా రెడ్డిని ఎదుర్కొని సత్తా చాటేందుకు ఈ రెండు పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి.

Allocation of tickets on caste basis in Nagarjuna Sagar Bypoll!
Allocation of tickets on caste basis in Nagarjuna Sagar Bypoll!

చివరి వరకూ అభ్యర్థిపై ఎటూ తేల్చకుండా మౌనం వహించిన సీఎం కేసీఆర్.. చివరి క్షణంలో దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తనయుడి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రతిపక్షాలకు షాకిచ్చారు..టీఆర్‌ఎస్ అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత తమ అభ్యర్థిని ప్రకటించాలని ఎదురుచూసిన బీజేపీ అనుకున్నట్టుగానే వ్యూహాత్మకంగా వ్యవహరించింది.టీఆర్ఎస్ అభ్యర్థిగా నోముల భగత్‌ను ఖరారు చేసిన కొద్దిసేపటికే బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. డాక్టర్ పానుగోతు రవికుమార్‌ను తమ పార్టీ అభ్యర్థిగా బీజేపీ బరిలోకి దింపింది. నిన్నటి వరకూ నివేదితా రెడ్డి, లేదా కడారి అంజయ్య యాదవ్‌కి టిక్కెట్ వచ్చే అవకాశాలున్నాయని పార్టీ శ్రేణులు భావించాయి. అనూహ్యంగా రవికుమార్ పేరును తెరపైకి తెచ్చింది. నియోజకవర్గంలో ప్రధాన ఓటు బ్యాంకును టార్గెట్ చేసుకుని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

Nagarjuna Sagar Bypoll : పోటీ పడుతున్న రెడ్డి ,యాదవ్ ,లంబాడీ అభ్యర్థులు

నాగార్జున సాగర్ నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి సామాజికవర్గం నుంచి జానా రెడ్డి బరిలో ఉన్నారు. గత 2018 ఎన్నికల్లో జానా రెడ్డిని ఢీకొట్టి నోముల నర్సింహయ్య విజయం సాధించారు. యాదవ సామాజికవర్గం బలంగా ఉండడమే అందుకు కారణం. నియోజకవర్గంలో రెడ్డి ఓటర్లు సుమారు 23 వేలు ఉండగా బీసీల ఓట్లు లక్షకు పైగా ఉన్నాయ్‌. అందులోనూ యాదవ సామాజికవర్గ ఓట్లు సుమారు 34 వేలకు పైగా ఉన్నాయ్‌. నోముల నర్సింహయ్య యాదవ సామాజికవర్గానికి చెందిన నేత కావడంతో బలమైన ప్రత్యర్థి అయినప్పటికీ జానా రెడ్డిపై విజయం సాధించారు.అభ్యర్ధుల విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ కంటే వెనుకబడ్డ బీజేపీ.. అభ్యర్థి ఎంపిక విషయంలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా వ్యవహరించింది. ప్రచారంలో ఉన్న పేర్లు కాకుండా.. ఎవరూ ఊహించని విధంగా కొత్త అభ్యర్థిని బరిలోకి దింపింది. డాక్టర్ పనుగోతు రవికుమార్ పేరును అధికారికంగా ప్రకటించింది. సాగర్‌ నియోజకవర్గంలో ఎస్టీ ఓట్లు 40 వేలకు పైగా ఉన్నాయి. అందులో కేవలం లంబాడీలు 38 వేలు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బలమైన సామాజికవర్గాలకు చెందిన నేతలకు టిక్కెట్లు కేటాయించడంతో ఎస్టీ ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టేందుకు బీజేపీ స్కెచ్ వేసింది. అందులో భాగంగానే డాక్టర్ పనుగోతు రవికుమార్‌ను అభ్యర్థిగా ఖరారు చేసిందన్న విశ్లేషణలు వ్యక్తమవుతున్నాయ్‌.

 

Related posts

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju