NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Eetala Rajendar: తెలంగాణ కాంగ్రెస్ లో ఈటెల లొల్లి..! సొంత నియోజకవర్గంలోనే సమస్య మొదలు…!!

Eetala Rajendar: మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ వ్యవహారం.. కాంగ్రెస్​లో కాక రేపింది. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారందరినీ సీఎం కేసీఆర్​ కక్షగట్టి బయటకు గెంటేస్తున్నారంటూ కాంగ్రెస్​ లీడర్లు ఈటలకు మద్దతుగా నిలిచారు. పీసీసీ చీఫ్​ ఉత్తమ్​ కుమార్​ రెడ్డితో పాటు వర్కింగ్ ​ప్రెసిడెంట్​ రేవంత్​ రెడ్డి, జీవన్​రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, దాసోజు శ్రవణ్​, సంపత్​ కుమార్​తో పాటు చాలా మంది లీడర్లు ఈటల పక్షాన మాట్లాడారు. టీఆర్​ఎస్​లోని మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాలు, ఆక్రమణలపై పవర్​పాయింట్​ ప్రెజెంటేషన్​ ఇచ్చి మరీ జనాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. అయితే, పార్టీ హుజూరాబాద్​ నియోజకవర్గ ఇన్​చార్జి ,రాజేందర్ చేతిలో ఓడిపోయిన పాడి కౌశిక్​ రెడ్డి మాత్రం ఈటలకు వ్యతిరేకంగా గొంతెత్తారు.

Disturbance in telangana congress by Eetala Rajendar
Disturbance in telangana congress by Eetala Rajendar

Eetala Rajendar: రాజేందర్ వర్సెస్ కౌశిక్​ రెడ్డి

ఈటల పై కౌశిక్​ రెడ్డి ఎన్నెన్నో ఆరోపణలు చేశారు. అదే ఇప్పుడు కాంగ్రెస్​లో చీలికకు కారణమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కౌశిక్​ రెడ్డి వరుస ప్రెస్​మీట్లు పెట్టి ఈటల మీద భూకబ్జాలు, ఆక్రమణల ఆరోపణలు చేశారు. ఆయన తీరుపై కాంగ్రెస్​లోని కొందరు సీనియర్​ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉంటూ టీఆర్​ఎస్​ డైరెక్షన్​లో పనిచేస్తున్నాడంటూ మండిపడుతున్నారు.

కౌశిక్​ రెడ్డి పై ఫిర్యాదు!

దీనిపై రెండ్రోజుల కిందట పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్కం ఠాగూర్​కు పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొన్నం ప్రభాకర్​ ఫిర్యాదు కూడా చేశారు. ఇటు ఈటల వ్యవహారంపై పార్టీ వైఖరేంటో క్లారిటీ ఇవ్వాలంటూ ఉత్తమ్​కూ లేఖ రాశారు. ఈటల విషయంలో పార్టీ అనుసరిస్తున్న తీరు ఇప్పుడు సరిగ్గా లేదని, ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్​ లీడర్లు టీఆర్​ఎస్​ ఎజెండాతో మాట్లాడుతున్నారని ఫిర్యాదు చేశారు. ఈ అంశాలపై పార్టీ ముఖ్యులతో మీటింగ్​ పెట్టి పార్టీ వైఖరిపై కార్యాచరణను వెల్లడించాలని కోరారు.కాగా ఉత్తమ్​కు కౌశిక్​ రెడ్డి దగ్గరి చుట్టం. దీంతో ఆయన అండతోనే కౌశిక్​ రెడ్డి ఇలా మాట్లాడుతున్నాడని పార్టీలో బహిరంగ చర్చ జరుగుతోంది.

 

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju