NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

MK Stalin: స్టాలిన్‌ది ఎంత దొడ్డ మనసో..!!

MK Stalin: ఓ పక్క దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రాల్లో కర్ఫ్యూ, లాక్ డౌన్ లాంటి కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నారు. కోవిడ్ నివారణ చర్యల విషయంలో పలు రాష్ట్రాల్లో అధికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి. అయితే తమిళనాడులో అందుకు భిన్నంగా వాతావరణం ఉంది. ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ గత రాజకీయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు.

MK Stalin humanity decisions
MK Stalin humanity decisions

 

Read More: Etela Rajender: బీజేపీలో చేరిక అంశంపై ఈటెల క్లారిటీ ఇది..!!

కీలక నిర్ణయాలను తీసుకుంటూ రాష్ట్ర ప్రజల మన్ననలు పొందుతున్నారు. కరోనా నివారణ చర్యలకు సంబంధించి ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడమే కాకుండా అందులో ప్రతిపక్ష పార్టీలకు అధిక భాగస్వామ్యం ఇచ్చారు. తమిళనాట ఎప్పుటూ ఉండే కక్షసాధింపు చర్యలకు స్వస్తి పలికారు. దివంగత సీఎం జయలలిత హయాంలో ఏర్పాటు చేసిన అమ్మ క్యాంటిన్ లను యథావిధిగా కొనసాగిస్తామని తెలిపారు. స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయంగా ఉంటున్నాయి అంటున్నారు.

అదే విధంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందే కరోనా రోగులకు సంబంధించి మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ప్రస్తుత కరోనా లాక్ డౌన్ కాలంలో రాష్ట్రంలోని పేద వర్గాలకు రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఇప్పుడు తాజాగా జర్నలిస్ట్ ల సంక్షేమానికి ఓ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు స్టాలిన్.

తమిళనాడులో కరోనా కారణంగా మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకునేందుకు రూ.10లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. అదే విధంగా బాధిత జర్నలిస్ట్ లకు రూ. 5వేలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇలా స్టాలిన్ తీసుకుంటున్న నిర్ణయాలను చూస్తున్న వారు స్టాలిన్‌ది ఎంత దొడ్డ (పెద్ద) మనసో అంటూ కీర్తిస్తున్నారు. ఇటువంటి నిర్ణయం దేశంలో ఇంత వరకూ ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదని జర్నలిస్ట్ సంఘాల నేతలు పేర్కొంటున్నారు.

 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju