NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Jagga Reddy: కరోనా వేళ తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కీలక నిర్ణయం..!!

Jagga Reddy: ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో బాధితులను ఆదుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుండి కరోనా బాధితులు ఇళ్లకు వెళ్లేందుకు అవసరమైన పలు సందర్భాలలో అంబులెన్స్ లు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితులను గమనించిన జగ్గారెడ్డి ఉచిత అంబులెన్స్ సర్వీసులను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు.

Jagga Reddy key decision in covid pandemic
Jagga Reddy key decision in covid pandemic

తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉస్మానియా, గాంధీ ఆసుపత్రి వద్ద రెండేసి చొప్పున అంబులెన్స్ లు ఏర్పాటు చేస్తున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. మరో రెండు మూడు రోజుల్లో వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. పేదలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఈ అంబులెన్స్ లను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు. తన తల్లిదండ్రుల పేరున ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న కోరిక తనకు ఉందనీ, ప్రస్తుత కరోనా సమయంలో అంబులెన్స్ ఏర్పాటు చేస్తే పేద ప్రజలకు ఎంతో మేలు చేసినట్లు అవుతుందని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వాన్ని తప్పుబట్టేందుకు కాకుండా పేదలకు సేవ చేయాలన్న తలంపుతోనే తాను అంబులెన్స్ లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

Read More: Sushant Singh Rajput case: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మరో వ్యక్తి అరెస్టు..!!

పీసీసీ సూచిస్తే ఇతర జిల్లాల్లోనూ అంబులెన్స్ సేవలను ఏర్పాటు చేస్తానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. గాంధీ భవన్ లోని అంబులెన్స్ లకు రోగుల తాకిడి పెరిగిందన్నారు. జిల్లాలకు పంపాలంటూ ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల నుండి గ్రామాలకు వెళ్లేందుకు ఈ సదుపాయం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎంత ఖర్చు అయినా గ్రామాలకు అంబులెన్స్ లను గ్రామాలకు తీసుకువెళతామని తెలిపారు. పనిలో పనిగా తానూ పీసీసీ రేస్ లో ఉన్నానని పేర్కొన్నారు జగ్గారెడ్డి. తనకు అవకాశం కల్పించాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ లను కోరారు. పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెబుతూనే తనకు అవకాశం  కల్పిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అంబులెన్స్ సర్వీసులు ఏర్పాటు చేస్తానని అన్నారు.

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju