Sushant Singh Rajput case: సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో మరో వ్యక్తి అరెస్టు..!!

Share

Sushant Singh Rajput case: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో నేడు మరో అరెస్టు జరిగింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబీ) అధికారులు ఈ రోజు మరొక వ్యక్తికి అదుపులోకి తీసుకున్నారు. వారం రోజల క్రితం హైదరాబాద్ లో సుశాంత్ సన్నిహితుడైన సిద్ధార్ధ్ పిథానీ ని అదుపులోకి తీసుకున్న ఎన్‌సిబీ అధికారులు తాజాగా బుధవారం సుశాంత్ కు సన్నిహితుడైన మరో వ్యక్తి హరీశ్ షాక్ ను ముంబాయిలోని బాంద్రా లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌సీబీ విచారణలో అతను పలువురు ప్రముఖులకు మారద దవ్యాలను సరఫరా చేసే వాడని తేలిసింది.

Sushant Singh Rajput case ncb arrests drug peddler harish khan
Sushant Singh Rajput case ncb arrests drug peddler harish khan

దీనిపై ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మాట్లాడుతూ ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామనీ, ఆ వివరాలను ఇప్పుడే వెల్లడించలేమని అన్నారు. హరీశ్ ఖాన్ సెల్ ఫోన్ లో, వాట్సాప్ చాటింగ్ లలో డ్రగ్స్ సరఫరాదారులతో లింకులు ఉన్నట్లు తేలడంతోనే వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Read More: Congress mp Shashi Tharoor: అందరికీ ఉచితంగా టీకాలు ఇవ్వాలి – కరోనా బెడ్ పై నుండే వీడియో సందేశం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్..!!

కాగా, గత సంవత్సరం జూన్ 14వ తేదీన సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే అతని స్నేహితురాలు, బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తిని ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేసి విచారించారు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఆమెకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.


Share

Related posts

Today Horoscope అక్టోబర్ 1st గురువారం మీ రాశి ఫలాలు

Sree matha

జగన్ వద్ద ఆ టాపిక్ ఎత్తే ధైర్యం ఎవరికీ లేదా..??

somaraju sharma

Pushpa: “పుష్ప” సినిమా యాక్షన్ సన్నివేశాల కోసం ఖర్చు చేస్తున్న బడ్జెట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

sekhar