NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Eatela Rajendar: ఈట‌ల‌ విష‌యంలో కేసీఆర్ ఎక్కువ ప‌రేషాన్ అవుతున్న‌ది ఎందుకంటే…

Eatela Rajendar: తెలంగాణ‌లో రాజ‌కీయాల ప‌ట్ల ఆస‌క్తి ఉన్న వారికి ప్ర‌స్తుతం మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఎపిసోడ్ ఎంతో ఆస‌క్తిని రేకెత్తిస్తున్న సంగ‌తి తెలిసిందే. అసైన్డ్ భూముల ఆరోపణల తర్వాత ఈటల రాజేందర్ మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ కావడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరడంతో హుజురాబాద్ లో త్వరలో ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉప ఎన్నిక‌కు ఇప్ప‌టికే ఈట‌ల సిద్ధ‌మైపోయారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం చేస్తున్నారు. అయితే, దాదాపు 2 దశబ్దాల పాటు హుజురాబాద్ లో తిరుగులేని నేతగా ఉన్న ఈటల వంటి బలమైన నేతను తట్టుకుని గెలిచే సత్తా ఉన్న లీడర్ కోసం గులాబీ బాస్ కేసీఆర్ అన్వేషణ కొనసాగిస్తున్నారు.

Read More: Eatela Rajendar: కొత్త గేమ్ మొద‌లుపెట్టిన ఈట‌ల‌… వ‌ర్క‌వుట్ అవుతుందా?

ఈట‌ల విష‌యంలో కేసీఆర్…
తెలంగాణ ఉద్యమంలో ఈటల రాజేందర్ కీలక పాత్ర పోషించ‌డం, ఆరు సార్లు వరుసగా ఎమ్మెల్యేగా విజయం, కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో హరీశ్ రావు సరస‌న నిలబడిన నేతగా ఈట‌ల రాజేంద‌ర్ ఎదిగారు. అంతటి లీడర్ ను ఢీ కొట్టాలంటే ఎవరైతే సరిపోతారన్న విషయంలో ఇంకా కన్ క్లూజన్ కు రాలేకపోతున్నారు. ఈటల స్థానాన్న భర్తీ చేయగల సత్తా ఎవరికుందనే కోణంలో ఒకటికి రెండుసార్లు అభ్యర్థుల పేర్లను పరిశీలిస్తున్నా.. ఏ పేరు దగ్గరా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ సంతృప్తి చెందడం లేదని తెలుస్తోంది.

Read more: KCR: కేసీఆర్ అవాక్క‌య్యేలా చేస్తున్న కాంగ్రెస్

ఆయ‌న పేరే ఎక్కువ‌గా…
హుజురాబాద్ లో గులాబీ పార్టీ తరపున బరిలోకి దింపేందుకు ఇప్పటికే అనేక మంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. వీరిలో ఎక్కవగా వినిపిస్తోన్న పేరు మాజీ ఎంపీ, ప్రస్తుత ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ వినోద్ కుమార్. ఈయనను పోటీలో నిలపాలన్న ప్రతిపాదన జిల్లా నేతల ద్వారా సీఎం కేసీఆర్ కు మొదట్లోనే వెళ్లింది. హుజూరాబాద్ నియోజకవర్గంలోని ద్వితీయశ్రేణి నాయకులతో ప్రయోగాలు చేసే కంటే ఈటలను ఢీకొనేందుకు దీటైన అభ్యర్థినే రంగంలోకి దింపాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ , బీజేపీల నుంచి టీఆర్ ఎస్ లో చేరి పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్న వలస అభ్యర్థుల కంటే రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ పోటీ చేస్తేనే బాగుంటుందని పార్టీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ ఎంపీగా ఉన్న సమయంలో హుజురాబాద్ నియోజకవర్గం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉండ‌టం మ‌రో కార‌ణంగా పేర్కొంటున్నారు.

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N