Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ గా ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ నీ రూల్ చేస్తున్నాడు. “బాహుబలి” సినిమా తో బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఇండస్ట్రీ వరకు అన్ని ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేసి.. తిరుగులేని హీరోగా చలామణి అవుతున్నాడు. ప్రభాస్ తో సినిమా అంటే బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది డైరెక్టర్లు అదేరీతిలో నిర్మాణ సంస్థలు క్యూ కట్టే పరిస్థితి. ఒకానొక టైంలో టాలీవుడ్ ఇండస్ట్రీ పరిమితమైన ప్రభాస్ ఇప్పుడు.. ఒప్పుకుంటున్న సినిమాలు తీరు చూస్తే మొత్తం అన్ని పాన్ ఇండియా సబ్జెక్ట్ కలిగిన సినిమాలే.
ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజేశం సినిమాతో పాటు మరో పక్క కే జి ఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” సినిమా చేస్తూ ఉన్నారు. ఈ రెండు ప్రాజెక్టుల లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో.. తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు బీభత్సంగా ఉన్నాయి. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ఒక బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ నటుడి కోసం తాజాగా ప్రశాంత్ నీల్ మార్చటం జరిగిందట. సినిమాకి అదే హైలెట్ క్యారెక్టర్ అని.. దీంతో అతగాడి కోసం స్క్రిప్ట్ లో కొద్దిగా చేంజ్ చేసినట్లు.. ప్రభాస్ కూడా ఓకే చెప్పినట్లు..టాక్.
Read More: Prabhas: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రభాస్ నాగ అశ్విన్ సినిమా టైటిల్..!!
త్వరలోనే ఆ క్యారెక్టర్ కలిగిన బాలీవుడ్ యాక్టర్ షూటింగులో జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలో ప్రభాస్ చేసే భారీ యాక్షన్ సన్నివేశాలు సినిమా మొత్తానికే హైలైట్ గా ఉండే రీతిలో డైరెక్టర్ చాలా జాగ్రత్తలు తీసుకోవటం జరిగిందట. హై ప్రొఫెషనల్ ఫైటర్స్.. అదే రీతిలో ప్రభాస్ బాడీ షేప్.. సినిమా మొత్తానికే హైలైట్ గా ఉండేలా డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం.