NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: రాష్ట్రంలో ప్రజా రంజక పాలన

AP CM YS Jagan: రాష్ట్రంలో ప్రజారంజ పాలన అందిస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో 75వ స్వాతంత్ర్య వేడుకలు ఘనంగా జరిగాయి. సీఎం వైఎస్ జగన్ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు. పతాక ఆవిష్కరణ తరువాత ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన సీఎం ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలో 26 నెలలుగా ప్రజారంజకమైన పాలన అందిస్తున్నామన్నారు. కొత్త లక్ష్యాలను నిర్ధేశించుకునే సమయం ఇదన్నారు. రేపు అనేది ప్రతి ఒక్కరికీ భరోసా ఇవ్వాలని అన్నారు. హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు. పారదర్శకమైన పాలన అందిస్తున్నామని పేర్కొన్న జగన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామనీ, 26 నెలల కాలంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు.

AP CM YS Jagan flag hoisting at Vijayawada
AP CM YS Jagan flag hoisting at Vijayawada

వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్లు ఖర్చు చేశామనీ, రైతులకు పగటి పటే నాణ్యమైన కరెంటు అందిస్తున్నామని చెప్పారు. రైతు భరోసా కింద ఏటా రూ.13,500లు చొప్పున అందిస్తున్నామనీ, పెట్టుబడి సాయంగా ఇప్పటి వరకూ రూ.17వేల కోట్ల ఇచ్చామనీ, 31 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల భీమా అందించామని వివరించారు. ప్రతి నెలా ఒకటవ తేదీనే లబ్దిదారుల గడప వద్దకే ఫించన్ అందిస్తున్నామని అన్నారు. గ్రామ , వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30వేల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని గుర్తు చేశారు. నాడు – నేడు ద్వారా పాఠశాలల రూపు రేఖలు మార్చామన్నారు. కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామన్నారు. రైతు టూ ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా రైట్ టూ ఇంగ్లీషు మీడియం ఉండాలని కోరుకుంటున్నామన్నారు. ప్రతి ఒక్క కుటుంబం ఆత్మగౌరవంతో బతికేందుకు సొంతిల్లు ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు.  పేద లందరికీ నవర్న పథకాలు అందిస్తున్నామన్నారు. జగనన్న విద్యా కానుక కింద రూ.1400 కోట్లు విద్యార్థుల కోసం ఖర్చు చేశామన్నారు. అమ్మఒడి పథకం కింద ఇప్పటి వరకు రూ.13,023 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా 8.71 లక్షల డ్వాక్రా మహిళలకు రూ.6,792 కోట్లు అందించామన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఇప్పటి వరకూ 9వేల కోట్ల రూపాయలు మహిళలకు అందిస్తామని తెలిపారు.

అక్క చెల్లెమ్మల భద్రత కోసం దిశ బిల్లు, దిశ పోలీస్ స్టేషన్ లు ఏర్పాటు చేశామని పేర్కొన్న జగన్ రాష్ట్రంలో మద్య నియంత్రణ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 26 నెలల కాలంలో వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ కింద రూ.3,900 కోట్లు ఖర్చు చేశామన్నారు. గ్రామ గ్రామాన వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేశామన్నారు. కోవిడ్ వల్ల తల్లి తండ్రి ఇద్దరిని కోల్పోయిన పిల్లలకు రూ.10లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తున్నామన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు రెండవ విడత డబ్బులు నెలలో అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు 278 శాతం ఐఆర్ ఇచ్చామని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో 39 లక్షల పెన్షన్లు ఉండగా వాటిని 61 లక్షల వరకూ పెంచామన్నారు. తొలుత జెండా ఆవిష్కరణ తర్వాత సాయుధ దళాల నుండి సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరించారు. వివిధ ప్రభుత్వ శాఖలు రూపొందించిన శకటాల ప్రదర్శనను సీఎం తిలకించారు.

Related posts

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N