NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Badvel By Poll: బద్వేలు వైసీపీ అభ్యర్థిని ప్రకటించిన సజ్జల

Badvel By Poll: బద్వేలు ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యుల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1 న నోటిఫికేషన్ విడుదల, అక్టోబర్ 30వ తేదీన పోలింగ్ జరగనుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వైసీపీ తమ పార్టీ అభ్యర్థిని ప్రకటించింది. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అభ్యర్థిని ప్రకటించారు. దివంగత ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య సతీమణి సుధ తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు సజ్జల. గత ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన వెంకట సుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చిన అకాలమరణం చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అభ్యర్థి సుధను ప్రకటించిన సజ్జల.. బద్వేలు ఉప ఎన్నికను సీరియస్ గా తీసుకుంటామని అన్నారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం నుండి టికెట్ ఇవ్వడం తమ పార్టీ సంప్రదాయమని చెప్పిన సజ్జల..సానుభూతిగా మిగిలిన పార్టీలు పోటీ ఉండకపోవడం సాంప్రదాయమన్నారు.

Sajjala Ramakrishna Reddy comments on Badvel By Poll:
Sajjala Ramakrishna Reddy comments on Badvel By Poll:

ఒక వేళ పోటీ పెట్టినా ఎంత సీరియస్ గా తీసుకోవాలో అలానే తీసుకుంటామన్నారు. నంద్యాల ఎన్నికకు ఈ ఎన్నికకు పోలిక లేదన్నారు. నంద్యాల ఉప ఎన్నికలో అప్పటి సీఎం చంద్రబాబు ఒక పెద్ద జనరల్ ఎన్నికలుగా తీసుకున్నారనీ, వంద కోట్ల వరకూ పంపిణీ చేశారనీ, పథకాలు ఆగిపోతాయని భయపెడితే ఆ ఫలితాలు వచ్చాయని అన్నారు సజ్జల. ఈ ఎన్నికలు తమ ప్రభుత్వానికి గత రెండేళ్లలో చేసింది చెప్పుకోవడానికి ఇదొక అవకాశంగా భావిస్తున్నామన్నారు. ప్రజల అభిప్రాయం ఎలా ఉందో తెలుసుకోవడం కూడా తమకూ అవసరమనీ, మెజార్టీ గతంలో వచ్చిన దానికంటే ఎక్కువ రావచ్చని అభిప్రాయపడ్డారు సజ్జల.

కాగా తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థిగా ఓబులాపురం రాజేశేఖర్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, బీజేపి – జనసేన అభ్యర్థులను పోటీకి నిలుపుతారా లేదా అనేది ఇష్టం చేయలేదు.

Read More:

1.Big Breaking: పంజాబ్ లో బిగ్ ట్విస్ట్..పీసీసీ అధ్యక్ష పదవికి సిద్దూ రాజీనామా..!!

2.Pawan Kalyan: వైసీపీ నేతల విమర్శలపై గ్రామ సింహాల గోంకారాలు అంటూ తనదైన స్టైల్ లో బదులిచ్చిన పవన్ కల్యాణ్..!!

3.YSRCP: తూర్పు గోదావరి జిల్లా వైసీపీ నేతలపై సీఎం జగన్ సీరియస్..?తాడేపల్లికి రావాలంటూ ఆదేశాలు..!!

 

Related posts

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N