NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Revanth Reddy: ఏపీ మంత్రి నాని నోట సమైక్య రాష్ట్రం మాట ..! తెలంగాణలో ప్రకంపనలు..! రేవంత్ ఫైర్..!!

Revanth Reddy: ఆంధ్రప్రదేశ్ లోనూ తమ పాలన కోరుకుంటున్నారని తెలంగాణ సీఎం కేసిఆర్ ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ప్లీనరీలో కేసిఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టిన తరువాత ఆంధ్రా ప్రాంతం నుండి వందలు, వేల మంది ఏపిలో మన పార్టీ పెట్టాలని కోరుతున్నారు, మీరు పెడుతున్న పథకాలు మాకు కావాలి, మీ పార్టీ పెడితే గెలిపించుకుంటాం అని చెబుతున్నారని కేసిఆర్ అన్నారు. కేసిఆర్ చేసిన ఈ వ్యాఖ్యలకు ఏపి సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో ప్రకంపనలు రేపాయి. వందలాది మంది త్యాగాల ఫలితంగా తెలంగాణ ఏర్పాటు అయ్యింది. ఇప్పుడు మళ్లీ ఏపి, తెలంగాణ రాష్ట్రాలను కలిపేద్దాం, సమైక్యంగా ఉందాం అంటే అసలే ప్రాంతీయ సెంటిమెంట్ అధికంగా ఉన్న తెలంగాణ ప్రాంత ప్రజలు, అక్కడి నాయకులు ఊరుకుంటారా. వెంటనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీరియస్ గా స్పందించారు.

Revanth Reddy serious on kcr,nani comments
Revanth Reddy serious on kcr,nani comments

Revanth Reddy:  ఏపి, తెలంగాణ కలిపేలా అసెంబ్లీలో తీర్మానాలు చేద్దాం

కేసిఆర్ చేసిన వ్యాఖ్యలపై ఏపి మంత్రి పేర్ని నాని ఏమన్నారంటే .. కేసిఆర్ ఏపిలో ప్రత్యేకంగా పార్టీ పెట్టాల్సిన అవసరం లేదు, రెండు రాష్ట్రాలను కలిపేలా ఇక్కడ అక్కడ అసెంబ్లీలో తీర్మానాలు చేస్తే బాగుంటుంది, రాష్ట్రం సమైక్యంగా ఉండిపోతుంది, అక్కడ ఇక్కడ పోటీ చేయవచ్చు అని నాని అన్నారు. తమ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ గతంలోనూ సమైక్యంగా రాష్ట్రం ఉండాలని కోరుకున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సమైక్య రాష్ట్ర ప్రతిపాదన కేసిఆర్ – జగన్ కుట్ర

దీనిపై టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. వందల మంది ఆత్మ బలిదానాలతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. అలాంటి తెలంగాణ జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు రేవంత్ రెడ్డి. కేసిఆర్ రాజ్య విస్తరణ కాంక్షకు తెలంగాణను బలిచ్చే కుట్ర జరుగుతోందని రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగు తల్లి ప్రత్యక్షం కావడం, మంత్రి పేర్ని నాని సమైక్య రాష్ట్ర ప్రతిపాదన తీసుకురావడం కేసిఆర్, జగన్ ఉమ్మడి కుట్రలో భాగమని రేవంత్ మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేస్తూ కేసిఆర్, నానిల కామెంట్ల వీడియోను షేర్ చేశారు.

హాట్ హాట్ గా మారిన నాని వ్యాఖ్యలు

ఏపి మంత్రి నాని చేసిన వ్యాఖ్యలు ఇటు ఆంధ్రప్రదేశ్ లో,. అటు తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏపికి ఎలాగూ రాజధాని లేదు. విశాఖలో రాజధాని ఏర్పాటు ఇప్పట్లో అయ్యేలా కనబడటం లేదు. ఇప్పుడు ఏపి, తెలంగాణను కలిపేస్తే అటు రాజధాని సమస్య తీరిపోతుంది. జల జగడం తొలగిపోతుందని ఏపి నుండి కామెంట్స్ వినబడుతుండగా, తెలంగాణలో మాత్రం ఏపి మంత్రి నాని వ్యాఖ్యలకు గరం గరం అవుతున్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను ఏపితో మళ్లీ కలవడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju