NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandra Babu: చంద్రబాబు అలా ఆరోపణలు ఎందుకు చేస్తున్నారో చెప్పిన వైసీపీ నేత సజ్జల..!!

Chandra Babu: కుప్పంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారనీ, అధికారులను అడ్డం పెట్టుకుని దౌర్జన్యాలు చేస్తున్నారనీ, దొంగ ఓట్లు వేస్తున్నారనీ టీడీపి అధినేత చంద్రబాబు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. దశాబ్దాలుగా నిర్మించుకున్న తన సొంత నియోజకవర్గం కుప్పం కోట బద్దలు అవుతుండటంతో చంద్రబాబులో అసహనం పెరిగిపోయి ఓటమికి సాకులు వెతుక్కుంటూ మతి భ్రమించినవాడిలా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. చిన్న మున్సిపాలిటీ కోసం చంద్రబాబు తోక తెగిన బల్లిలా గిలగిలా కొట్టుకుంటున్నారని సజ్జల ఎద్దేవా చేశారు.

sajjala rama krishna reddy comments on Chandra Babu
sajjala rama krishna reddy comments on Chandra Babu

 

Chandra Babu: కుప్పంలో గెలుపు ఖాయం

కుప్పంలో దొంగ ఓట్ల వేయించడం, వేరే ప్రాంతాల నుండి జనాలను తరలించడం ఇంత కాలం చంద్రబాబు చేస్తూ వచ్చినవేననీ, ఇప్పటికీ కుప్పంలో వేల సంఖ్యలో దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. ఓటర్లకు డబ్బులు, ముక్కు పుడకలు, ఇతర తాయిలాలు పంపిణీ చేస్తూ టీడీపీ కార్యకర్తలు అడ్డంగా దొరికిపోయారంటూ వీడియోలను మీడియా ముందు ప్రదర్శించారు సజ్జల. తాము అధికార దుర్వినియోగానికి పాల్పడితే టీడీపీకి చెందిన వందలాది మంది కార్యకర్తలు రోడ్ల మీదకు వచ్చి డౌన్ డౌన్ అని అరవగలరా ?, చిత్తూరు వైసీపీ ఎంపిని బయటకు రానివ్వకుండా నిర్బంధించగలరా ? అని సజ్జల ప్రశ్నించారు. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఎన్నికల్లోనూ ప్రజలు వైసీపీని ఆశీర్వదిస్తున్నారని అన్నారు.  వైసీపీ ఎన్నడూ దిగజారుడు విధానాలకు పోలేదు, పోదు అని సజ్జల స్పష్టం చేస్తూ కుప్పంలో వైసీపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.

చంద్రబాబు ప్రెస్ మీట్ చూస్తే ఆయన ఈ జన్మకు మారడు అనేది స్పష్టం అవుతుందని, చంద్రబాబు మాట్లాడినవన్నీ ఆయనకే వర్తిస్తాయని సజ్జల అన్నారు. తమ ఏజెంట్ లను అరెస్టు చేశారనీ చంద్రబాబు అంటున్నారు అసలు ఏజెంట్లుగా రౌడీ షీటర్లను ఎందుకు పెట్టారని సజ్జల ప్రశ్నించారు. కుప్పంలో ఘోరంగా ఓటమి పాలవుతున్నారు కాబట్టే ఘోరాలు జరుగుతున్నాయని ప్రపంచాన్ని నమ్మించడానికి చంద్రబాబు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని సజ్జల మండిపడ్డారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju