NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Districts Bifurcation: ఆందోళనల ఎఫెక్ట్ ..జిల్లాల విభజన నోటిఫికేన్ లో ఈ మార్పులు చేసిన ఏపి సర్కార్

AP Districts Bifurcation: ఏపిలో జిల్లాల పునర్విభజన కార్యక్రమంలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా చేస్తూ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే జిల్లాల  విభజన చేసిన తీరుపై పలు ప్రాంతాలలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తమ ప్రాంతాలు జిల్లా కేంద్రానికి దూరం అవుతాయని పేర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన నోటిఫికేషన్ లో ప్రభుత్వం కొన్ని మార్పులు చేసింది.

AP Districts Bifurcation notification small changes
AP Districts Bifurcation notification small changes

 

Read More: Guntur Jinnah Tower: రంగు పడింది.. వివాదం ముగిసింది..వైసీపీ మాస్టర్ ప్లాన్ అదుర్స్

AP Districts Bifurcation: ధర్మవరం రెవెన్యూ డివిజన్ రద్దు

గుంటూరు జిల్లాలో నాలుగు మండలాలను నరసరావుపేట రెవెన్యూ డివిజన్ కు మార్పు చేసింది. అదే విధంగా పెదకూరపాడు, అమరావతి, క్రోసూరు, అచ్చంపేట మండలాలను నరసరావుపేట డివిజన్ కు మార్చింది. మరో పక్క అనంతపురం జిల్లాలోనూ కొన్ని మార్పులు చేసింది. అనంతపురం జిల్లా కదిరి రెవెన్యూ డివిజన్ ను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ధర్మవరం రెవెన్యూ డివిజన్ ను రద్దు చేసింది. ధర్మవరంలో ఉన్న నాలుగు మండలాలను పుట్టపర్తి రెవెన్యూ డివిజన్ కు మార్పు చేసింది. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలాన్ని చిత్తూరు రెవెన్యూ డివిజన్ లో కలిపింది.

 

కొత్త జిల్లాలు ఉగాది లోపు

జగన్మోహనరెడ్డి సర్కార్ ఎటువంటి ముందస్తు ఊహాగానాలకు తావు లేకుండా అకస్మాత్తుగా జిల్లాల పునర్విభజనను తెరపైకి తీసుకువచ్చింది. జగన్ అనుకున్నదే తడవుగా రాత్రికి రాత్రి అత్యవసర మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజన ప్రక్రియకు ఆమోదం తెలిపి నోటిఫికేషన్ విడుదల చేసింది. పరిపాలనా సౌలభ్యం కోసమే జిల్లాల ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. కొందరు కావాలనే వివాదాన్ని రేకెత్తిస్తున్నారని వారు ఆరోపించారు. ఏపిలో కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను ఉగాది లోపు పూర్తి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉంది. ప్రజలకు పరిపాలన మరింత చేరువ చేసేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామని సీఎం వైఎస్ జగన్ ఎన్నికలకు ముందు హామీ ఇవ్వడంతో పాటు మేనిఫెస్టోలోనూ పొందుపర్చారు. ఈ మేరకు నాలుగు రోజుల క్రితం ప్రభుత్వం నోటిఫికేష్ జారీ చేసింది. కొత్త జిల్లాల ఏర్పాటునకు సంబంధించి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు 30 రోజుల్లోగా తెలియజేయాలని కోరింది.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju