NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Chinna Jeeyar: వేల కోట్ల కథలు.. వందల విల్లాల కహానీలు..! టీడీపీ ఏడుపు వెనుక..!?

Chinna Jeeyar: POlitical Swamiji TDP Special Stories

Chinna Jeeyar: చిన్న జీయర్ స్వామి మీద పాపం టీడీపీ వాళ్లకు తెగ కోపమొచ్చేసింది.. తాను ఎంతో ప్రతిష్టగా చేసిన “రామానుజ విగ్రహ” కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ ని పిలిచి, మంచోడని కీర్తించి, ఇంకా ఇంకా అధికారంలో ఉండాలని దీవించారు.. అది టీడీపీ వాళ్లకు బాగా కోపం తెప్పించింది. కడుపులో ఉన్న మంట బయటకు వచ్చేలా చేసింది..

అందుకే నిన్నటి నుండి టీడీపీ సోషల్ మీడియా పేజీల్లో “వేల కోట్ల అక్రమాలు.., వందల కోట్ల అక్రమాలతో విల్లాలు.., జనం సొమ్ముతో పూజలు అంటూ మోసాలు..,వందలాది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు” అంటూ కథనాలు వస్తున్నాయి.. దీనిలో నిజాలేమిటో కాసేపు పక్కన పెట్టేద్దాం.. కానీ అదే చిన్న జీయర్ స్వామి.. “ఓయ్ జగన్ నువ్వు సరిగ్గా పాలించడం లేదు.. నీకు పాల చేతకాదు.. చంద్రబాబుని చూసి నేర్చుకో” అని చివాట్లు పెట్టి ఉంటె ఇదే టీడీపీ సోషల్ మీడియా “స్వామిజి అంటే చిన్న జీయర్.. నిజాయతీ పరుడు.. నిలువుటద్దం..” అంటూ తెగ పోగిడేవారు.. ఆయన చేసే సహస్రాబ్ది కూడా నచ్చేసేది..!

Chinna Jeeyar: POlitical Swamiji TDP Special Stories
Chinna Jeeyar: POlitical Swamiji TDP Special Stories

Chinna Jeeyar: రెండు అంశాలు చెప్పుకుంటే..!

ఇక్కడ మనం బాగా చెప్పుకోవాల్సింది.. త్రిదండి చినజీయర్ స్వామి, స్వరూపానందేంద్ర సరస్వతి ఈ ఇద్దరు వేరువేరు శాఖలకు చెందిన పీఠాధిపతులు. స్వరూపానందేంద్ర సరస్వతి విశాఖలోని శారదా పీఠాధిపతి కాగా, చినజీయర్ స్వామి శంషాబాద్ సమీపంలోని శ్రీశ్రీశ్రీ శ్రీమన్నారాయణ పీఠం. ఎవరి ఫీఠాలు వారివి..! ఎవరి పూజలు వారివి..! ఎవరి నమ్మకం వారిది..! ఎవరి భక్తులు వారు..! కానీ రాజకీయ నాయకులు మాత్రమే ఇద్దరికీ కామన్ భక్తులు.

ఇటు స్వరూపానందేంద్ర స్వామి వద్దకు వెళతారు. అటు చినజీయర్ స్వామి వద్దకు ప్రజాప్రతినిధులు, నేతలు వెళతారు. అక్కడ ఆశీర్వాదం తీసుకుంటారు. ఇక్కడా ఆశీర్వాదం తీసుకుంటారు. రాజకీయ నాయకులు, పాలకులు మాత్రం కామన్ భక్తులు. సాధారణ భక్తులు మాత్రం ఎవరి నమ్మకం వాళ్లది. కొంత మంది మాత్రమే రెండు చూట్లకు వెళుతుంటారు. అయితే ఇప్పుడు స్వామిజీల మీద పొలిటికల్ ఎజెండా మారింది. స్వామిజీల పొలిటికల్ ఎజెండా కూడా మారింది.

Chinna Jeeyar: POlitical Swamiji TDP Special Stories
Chinna Jeeyar: POlitical Swamiji TDP Special Stories

ఏ విధంగా మారాయి అనేది పరిశీలిస్తే..? చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది వేడుకలకు ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి హజరై అక్కడ ప్రతిష్టించిన సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు స్వీకరించారు. ఆ కార్యక్రమం బాగా జరిగింది. ఆ కార్యక్రమంపై టీడీపీ కన్ను పడింది. ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియాలో చినజీయర్ స్వామి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు.

ఆ విగ్రహం ఏర్పాటునకు వందల కోట్లు పోగేశారు. దాని చుట్టూ వేలాది ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. ఒక్కో విల్లా రూ.15కోట్లకు అమ్ముతున్నారు. ఇతందా స్వామిజీ పేరు, ఆ విగ్రహం పేరు చెప్పుకుని ఆయన ఆశ్రమం, ఆయన భక్తులు చేస్తున్న ఒక పెద్ద వ్యాపారం అని టీడీపీ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు పెట్టింది.

ఇదే సోషల్ మీడియా గతంలో అంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో విశాఖపట్నంలోని స్వరూపానందేంద్ర సరస్వతి ఆశ్రమం గురించి పోస్టులు పెట్టారు. స్వరూపానందేంద్ర స్వామి జగన్మోహనరెడ్డి అధికారంలోకి వచ్చేందుకు పూజలు, యాజ్ఞాలు చేశానని చెప్పడం, ప్రభుత్వం కూడా ఆయనకు ఆశ్రమాలు పెట్టుకునేందుకు అక్కడక్కడా స్థలాలను కేటాయించడం, ఇలా ఇద్దరికీ స్నేహం ఉండటంతో స్వరూపానందేంద్ర సరస్వతిపైనా టీడీపీ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆరోపణలు చేసింది.

Chinna Jeeyar: POlitical Swamiji TDP Special Stories
Chinna Jeeyar: POlitical Swamiji TDP Special Stories

బాబు కూడా గతంలో…!

నిజానికి చినజీయర్ స్వామి ఆశ్రమానికి గతంలో చంద్రబాబు కూడా వెళ్లారు. సీఎంగా ఉన్నప్పుడూ వెళ్లారు. చినజీయర్ స్వామి జన్మదిన వేడుకలకు వెళ్లారు. సీఎంగా దిగిపోయిన తరువాత 2019 నవంబర్ లోనూ వెళ్లారు. 2020లోనూ వెళ్లారు. చిన జీయర్ స్వామి వద్దకు పార్టీలకు అతీతంగా అందరూ వెళుతుంటారు. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా పెద్ద నాయకులు, చిన్న నాయకులు అందరూ వెళుతుంటారు.

అయితే అప్పుడు చంద్రబాబు వెళ్లినప్పుడు టీడీపీ సోషల్ మీడియా చినజీయర్ స్వామిని టార్గెట్ చేయలేదు. కానీ ఇప్పుడు కేసిఆర్, జగన్ వెళ్లినప్పుడు మాత్రం టీడీపీ ఆయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, విమర్శలు చేస్తోంది. స్వామిజీలే ఒక రకంగా పరిపాలనను నడిపిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నారు.

Related posts

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju