NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Viveka: వివేకా కేసులో రంగంలోకి అమిత్ షా.. హోమ్ శాఖ అత్యవసర మీటింగ్!?

YS Viveka: ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం హాట్ టాపిక్ గా నడుస్తోంది. రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఈ కేసు చుట్టూనే తిరుగుతున్నాయి. ఓ వైపు తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియా వైసీపీ ఎంపి అవినాష్ రెడ్డి పాత్ర ఉంది, ఆయన తండ్రి భాస్కరరెడ్డి చేయించారు, వారి వెనుక జగన్మోహనరెడ్డి పాత్ర ఏమైనా ఉందేమో వీళ్లందరినీ సీబీఐ విచారించాలని పట్టుబడుతోంది. టీడీపీ నాయకులు వర్ల రామయ్య, డేవిడ్ రాజు, దేవినేని ఉమా తదితర నేతలు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో టీడీపీ అనుకూల మీడియా ఈ కేసు మీదే ఎక్కువ పోకస్ పెట్టింది. గతంలో సీబీఐకి ఎవరెవరు వాంగ్మూలాలు ఇచ్చారు. వారు ఏమని చెప్పారు అనే విషయాలను ఒక్కటొక్కటిగా ప్రసారం చేస్తున్నారు. గత పది రోజులుగా రోజుకు ఒకరి వాంగ్మూలాన్ని బయటకు తీస్తూ వివేకా కేసులో కొత్త కొత్త విషయాలను బహిర్గతం చేస్తున్నాయి. ఇలా టీడీపీ, దాని అనుకూల మీడియా ఒక స్టాండ్ లో ఉంది.

YS Viveka case Amith shah meeting...?
YS Viveka case Amith shah meeting…?

 

YS Viveka: ఏవరి ప్రచారం వారిది

మరో వైపు వైసీపీ ఒక స్టాండ్ లో ఉంది. దాని అనుకూల మీడియా వారి స్టాండ్ ప్రకారం కథనాలు ఇస్తున్నాయి. ఇది చంద్రబాబు చేయిస్తున్నారు. ఇది టీడీపీ కుట్ర, వైఎస్ సునీత చంద్రబాబుకు పావుగా మారింది. చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా వైఎస్ కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు అవినాష్ రెడ్డిపై కేసు రుద్దాలని చేస్తున్నారు అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. ఈ ప్రచారం జనాలు నమ్మేలా సోషల్ మీడియాలో టీడీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తోంది. ఇలా ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ఉన్నప్పుడు బీజేపీ తన పాత్రను పోషిస్తూ ఉంది. కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన దస్తగిరి గానీ, వైఎస్ సునీత, వైఎస్ కుటుంబీకుల్లో కొందరు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి పేర్లను తమ వాంగ్మూలాల్లో పేర్కొన్నారు.

YS Viveka: అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే..?

గతంలో ఏప్పుడో సీబీఐ నమోదు చేసిన వాంగ్మూలాల్లో అవినాష్ రెడ్డి పేరు, ఆయన తండ్రి పేరు ఉంటే ఇప్పటి వరకూ వాళ్లకు ఎందుకు నోటీసులు ఇచ్చి విచారణ చేయలేదు అని అనేక మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసు మొత్తాన్ని నడిపించేది కేంద్రంలోని బీజేపీ. అంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. బీజేపీ అగ్రనాయకుల్లో ప్రధాని మోడీ తరువాత స్థానంలో ఉన్న అమిత్ షా నుండి గ్రీన్ సిగ్నల్ వస్తేనే ఈ కేసులో ఏమైనా జరుగుతుంది అని అందరూ అనుకుంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ ఎవరు ఏమి చెప్పినా, మీడియాలో ఎన్ని కథనాలు వచ్చినా..ఈ కేసులో కీలక వ్యక్తుల అరెస్టులు ఉంటాయా..? ఉండవా..? అనేది తేల్చాల్సింది ఆ పెద్దాయనే అన్నది జగమెరిగిన సత్యం.

Related posts

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N