NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Assembly: టీడీపీ ఎమ్మెల్యేలు విజిల్ వేశారు.. స్పీకర్ సస్పెండ్ చేశారు..!!

AP Assembly: అసెంబ్లీ సమావేశాల్లో జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాలపై చర్చ జరపాలని టీడీపీ డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో మంగళవారం నలుగురు సభ్యులను ఈ నెల 25వ తేదీ వరకూ  సస్పెండ్ చేయగా తరువాత మరో ఇద్దరు ఎమ్మెల్యేలను ఈ నెల 25వ తేదీ వరకూ మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలను ఈ ఒక్క రోజు సస్పెండ్ చేశారు. టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించి ప్రశ్నోత్తరాలు నిర్వహించిన అనంతరం  పోలవరంపై స్వల్పకాలిక చర్చ ప్రారంభించారు. సభలో టీడీపీ సభ్యులు విజిల్ వేయడంతో స్పీకర్ వారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సభామర్యాదను కాపాడాలంటూ హెచ్చరించారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఏలూరి సాంబశివరావు, గద్దె రామ్మోహన్ లను ఈ నెల 25వ తేదీ వరకూ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్ తమ్మినేని.. విజిల్ వేసిన మిగతా సభ్యులను ఈ ఒక్క రోజు సస్పెండ్ చేశారు.

AP Assembly TDP Mlas suspension
AP Assembly TDP Mlas suspension

Read More: AP Politics: ఫుల్ ప్లానింగ్ తో పవన్ కళ్యాణ్ ..! బీజేపీ – టీడీపీ మధ్యలో..కానీ..!?

AP Assembly: బుద్దీ, జ్ఞానం లేని వాళ్లు చాలా మంది ఉన్నారు

సస్పెన్షన్ అనంతరం టీడీపీ ఎమ్మెల్యేలు దీనిపై మండిపడ్డారు. అసెంబ్లీలో బుద్దీ, జ్ఞానం లేని వాళ్లు చాలా మంది ఉన్నారంటూ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘాటుగా విమర్శించారు తాము స్పీకర్ క దాదాపు అయిదు మీటర్ల దూరంలో ఉండి నిరసన తెలుపుతున్నామనీ, అయినా తమను అకారణంగా సస్పెండ్ చేశారని అన్నారు. జగన్ సర్కార్ మద్యంపై వచ్చే అదాయం మీదే దృష్టి పెట్టిందని రామ్మోహన్ ఆరోపించారు. సభలో వైసీపీ నేతల ప్రవర్తన బాగోలేదని అన్నారు. సభలో కల్తీసారా కు సంబంధించి ఆధారాలను టీడీపీ బయటపెడుతుంటే సీఎం జగన్ ముఖం చాటేశారని విమర్శించారు.

‘అసెంబ్లీలో సీఎం భజన’

మార్షల్స్ సాయంతో సభను నడిపిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ విమర్శించారు. తమలో ఎంత మందిని సస్పెండ్ చేసినా చివరి సభ్యుడు ఉన్నంత వరకూ కల్తీ సారా పై పోరాటం సాగిస్తూనే ఉంటామన్నారు. వైసీపీ సభ్యులు సభలో సీఎం భజన చేస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. మర్షల్స్ సాయంతో సభ నిర్వహించడం చూస్తుంటే తమకు సిగ్గేస్తుందన్నారు. కల్తీ సారాపై ఆధారాలను తాము బయటపెడుతుంటే సీఎం ముఖం చాటేశారని విమర్శించారు.

 

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju