NewsOrbit
5th ఎస్టేట్ జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసిఆర్ ను నమ్మని ఆ 13 పార్టీలు ..! బీజేపీతో టీఆర్ఎస్ సీక్రెట్ బంధమా..!?

KCR: జాతీయ స్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామంటూ గత కొన్ని సంవత్సరాలుగా మాటలు చెప్పి..జాతీయ స్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పుతానని తెలంగాణ ప్రజలకు కూడా ఒక రకమైన నమ్మకం కల్పించిన టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసిఆర్ ఒక రకంగా దారుణంగా ఫెయిల్ అయ్యారు. కేసిఆర్ కు జాతీయ స్థాయిలో పరువు తక్కువ అయ్యింది అని చెప్పవచ్చు. రీసెంట్ గా కేంద్రంలో బీజేపీ మత విద్వేషాలను రెచ్చగొడుతోంది అంటూ బీజేపీ వైఖరిని నిరసిస్తూ 13 రాజకీయ పార్టీల నేతలు ప్రజలకు లేఖ రాశారు. కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీతో పాటు శరద్ పవార్, ఉద్దవ్ ఠాకరే, హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్, మమత బెనర్టీ, స్టాలిన్ తదితర జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల అధినేతలు లేఖను విడుదల చేశారు. ఈ 13 పార్టీల నేతలు బీజేపీకి బద్ద వ్యతిరేకులు. కాంగ్రెస్ పార్టీతో ఉంటారా..?  లేదా..? అనేది పక్కన బెడితే బీజేపీకి వ్యతిరేకులు. కేసిఆర్ కూడా ఇటీవల బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఢిల్లీకి వెళ్లారు. ధర్నా చేశారు. మీడియా సమావేశం పెడితే చాలు మోడీ, అమిత్ షా, బీజేపీని విమర్శిస్తూ ఉన్నారు. గత మూడు నాలుగు నెలల నుండి కేసిఆర్..బీజేపీని తిట్టడమే పనిగా పెట్టుకుని ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. బీజేపీ మీద వ్యతిరేకంగా ధర్నాలు చేయడానికి ఢిల్లీ వెళుతున్నారు.

Leaders of the Opposition not trust on KCR..?
Leaders of the Opposition not trust on KCR..?

KCR: కేసిఆర్ బీజేపీకి రహస్య మిత్రుడు..?

అయితే కేసిఆర్ వైఖరిని తెలంగాణ ప్రజలు నమ్మారో లేదో తెలియదు కానీ..జాతీయ స్థాయిలో పార్టీ నేతలకు మాత్రం స్పష్టంగా అర్ధం అవుతోంది. ఎందుకంటే.. ఈ 13 పార్టీల్లో ఆయనను కలుపుకోలేదు. దానితో పాటు ఈ 13 పార్టీలు ప్రణాళికలు చర్చించుకోవడానికి కేసిఆర్ ను కనీసం ఆహ్వానించడం లేదు. బీజేపికి వ్యతిరేకంగా కేంద్రం స్థాయిలో ఒక కూటమిని ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు కూడా కేసిఆర్ ను ఆహ్వానించడం లేదు. కనీసం సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఎందుకు అంటే..? కేసిఆర్ మీద నమ్మకం లేక. ఇదే కేసిఆర్ గతంలో స్థాలిన్, మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ ను కలిశారు. కలిసినప్పుడల్లా బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలు అన్నీ ఏకం కావాలి. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని చెప్పారు. దీనికి సంబంధించి ఒక్క శాతం కూడా కేసిఆర్ సక్సెస్ కాలేదు. ఢిల్లీ లో వీళ్లందరితో కలిసి ఒక్క మీటింగ్ కూడా ఏర్పాటు చేయలేదు కేసిఆర్. కానీ తెలంగాణలో మీటింగ్ పెట్టిన ప్రతి సారి ఫెడరల్ ఫ్రంట్ అని అంటుంటారు. ఈ 13 పార్టీలు చేసిన పనితో కేసిఆర్ బీజేపీతో రహస్య మిత్రుడు అన్న క్లారిటీ వచ్చింది.

పీకే కేసిఆర్ కు క్లైయింట్ అయినప్పటికీ..

పైగా కేసిఆర్ బీజేపీకి శత్రువు కాదు. రహస్య మిత్రుడే, కేంద్రంలోని బీజేపీకి ఆపత్కాలంలో రాజ్యసభ సభ్యులను కేసిఆర్ అందిస్తారు అన్న అనుమానంతో ఆ 13 పార్టీల నేతలు ఆయనను నమ్మకూడదు అని ఒక క్లారిటీకి వచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే.. ఈ 13 పార్టీలకు ప్రణాళికలు వేస్తుంది రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్(పీకే)యే. పీకే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్త, ఆ పార్టీలో ఒక మెంబర్. పైగా అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, స్టాలిన్ లకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్. వీళ్లకు క్లైయింట్. అదే ప్రశాంత్ కిషోర్ కేసిఆర్ కు కూడా క్లైయింట్ యే కదా. మరి ఆ 13 పార్టీలతో కేసిఆర్ ను కలిపేందుకు పీకే ట్రై చేయలేదు అన్నది అలోచిస్తే.. ప్రధానంగా సోనియా గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ తదితరులు నమ్మకపోవడమేననేది స్పష్టం అవుతోంది.  ఇక ఏపి సీఎం వైఎస్ జగన్ సంగతి చెప్పాల్సిన పని లేదు. కేంద్రంలోని బీజేపీ పెద్దలతో అంతర్గత స్నేహం కొనసాగిస్తున్న సంగతి దేశ వ్యాప్తంగా తెలిసిందే.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju