NewsOrbit
హెల్త్

Laddu benefits: రోజుకు ఒక లడ్డు తింటే చాలు..ఎలాంటి అనారోగ్యం అయినా సరే ఇట్టే మాయం…!

Laddu benefits: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రతి ఒక్కరు ఏదో ఒక అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.శరీరానికి సరైన వ్యాయామం, అన్ని పోషకాలతో కూడిన ఆహరాన్ని తీసుకోవడం వలన మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ మధ్య కాలంలో వయసుతో పని లేకుండా ప్రతి ఒక్కరు కూడా కీళ్ల నొప్పులు,మోకాళ్ళ నొప్పులు,అలసట,నీరసం వంటి సమస్యలతో బాధ పడుతున్నారు.అందుకే మేము చెప్పే ఈ ప్రత్యేకమైన లడ్డును క్రమం తప్పకుండా తిని చుడండి అతి కొద్ది రోజుల్లోనే మీ శరీరంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం చెప్పండి పోషకాలతో కూడిన లడ్డును ఎలా తయారు చేయాలో చూద్దాం.

కావలిసిన పదార్ధాలు :

నెయ్యి -పావు కప్పు
జీడిపప్పు -1కప్పు
పిస్తా పప్పు -1కప్పు
బాధంపప్పు -1 కప్పు
కిస్ మిస్ -1కప్పు
ఎండు కొబ్బరి పొడి -కొద్దిగా
ఎండు ఖర్జురాలు -5
తెల్ల నువ్వులు -అర కప్పు
గసగసాలు -2 స్పూన్స్
యాలకల పొడి -1/2టీ స్పున్

Laddu లడ్డు తయారు చేసే విధానం :

ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేసి బాదం పప్పును వేసి ఒక నిమిషం పాటు వేగనివ్వాలి. ఆ తరువాత అందులోనే జీడిపప్పు, పిస్తా పప్పు కూడా వేసి మరో రెండు నిమిషాల పాటు ఎర్రగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే పాన్ లో మరొక చెంచా నెయ్యి వేసి కిస్ మిస్ లను కూడా వేయించి ఒక్క కప్పులోకి తీసుకోవాలి.అలాగే అందులోనే అరకప్పు ఎండు కొబ్బరి తురుము,తెల్ల నువ్వులను, గసగసాలను కూడా వేసి వేగించి పక్కన పెట్టుకోవాలి.ఇలా వేపిన అన్నిటిని కాసేపు చల్లరే వరకు పక్కన పెట్టుకొండి. తరువాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోవేగించిన బాదం పప్పు,జీడిపప్పు,పిస్తా పప్పు,నువ్వులను వేసి బాగా మెత్తగా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టండి

.ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీ జార్ లో మళ్ళీ గింజలు తీసేసిన ఎండు ఖర్జూరం, కిస్ మిస్ వేసి మిక్సీ పట్టండి.ఇలా మిక్సీ పట్టిని డ్రై ఫ్రూట్ పొడి, ఖర్జురం పొడిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో కొబ్బరి పొడి, పావు స్పూన్ యాలకుల పొడి,ఒక స్పూన్ నెయ్యి, గసగసాలను వేసి బాగా కలిపి చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డులుగా చుట్టుకోండి. ఇలా తయారుచేసుకున్న లడ్డులలో ఇన్ని పోషకాలు ఉంటాయి. ప్రతి రోజు ఒక లడ్డు తింటే శరీరానికి కావలిసిన పోషకాలు అన్ని సమపాళ్ళలో అందుతాయి.చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఈ లడ్డును తినవచ్చు.ఇలా తయారు చేసుకున్న లడ్డులను గాలి చొరబడని డబ్బాలో పెట్టి మూత పెట్టుకుంటే వారం రోజుల పాటు పాడవకుండా ఉంటాయి.

Related posts

Dark circles: కంటి కింద పేరుకుపోయిన వలయాల నుంచి విముక్తి కలిగించే యోగాసనాలు ఇవే..!

Saranya Koduri

Health: మలబద్ధకం సమస్యతో చింతిస్తున్నారా… అయితే ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

Coconut oil: కొబ్బరి నూనె ఉపయోగించి.. ఫేస్ పై ఉన్న టాన్ ని తరిమికొట్టండి..!

Saranya Koduri

Diabetes: డయాబెటిస్తో చింతిస్తున్నారా.. అయితే ఈ పొడితో చెక్ పెట్టండి.‌.!

Saranya Koduri

Skin: సెవెన్ డేస్ స్కిన్ గ్లో చాలెంజ్.. పక్కా సక్సెస్..!

Saranya Koduri

Beetroot: ఆ వ్యక్తులు అస్సలు బీట్రూట్ తినకూడదు.. తింటే అంతే ఇక..!

Saranya Koduri

Health: స్త్రీలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారాలు ఇవే..!

Saranya Koduri

health: ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ ని తీసుకుని చెక్ పెట్టండి..!

Saranya Koduri

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

Saranya Koduri

Health: క్రమం తప్పకుండా జీడిపప్పు తినడం ద్వారా కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!

Saranya Koduri

Health: వరుసగా 30 రోజులపాటు బొప్పాయ తినడం ద్వారా లాభమా? నష్టమా?

Saranya Koduri

కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ వెజిటేబుల్ ని అస్సలు తినవద్దు..!

Saranya Koduri

నాన్ స్టిక్ పాన్ లు ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే..!

Saranya Koduri

తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా?.. ఇలా చెక్ పెట్టండి..!

Saranya Koduri

అరటిపండుతో పోషకమైన జుట్టు మీ సొంతం..!

Saranya Koduri