ఆధునిక జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ కాలంలో థైరాయిడ్ వందలో 50 శాతం మంది ప్రజలు థైరాయిడ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.థైరాయిడ్ సమస్య వస్తే జీవితాంతం హార్మోన్ టాబ్లెట్స్ వాడుతూనే ఉండాలి.థైరాయిడ్ కారణంగా డయాబెటిస్, స్థూలకాయం వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తినడం ద్వారా థైరాయిడ్ సమస్యను నియంత్రించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అసలు థైరాయిడ్ అంటే ఏంటో చూద్దాం..
థైరాయిడ్ తగ్గడానికి ఉసిరి :
థైరాయిడ్ వున్న వారు ఆహారంలో పోషక గుణాలు ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. థైరాయిడ్ ఉన్నవారు ఆరోగ్యంగా ఉండేందుకు ఉసిరి చాలా ఉపయోగపడుతుంది. ఉసిరిలో ఆరెంజెస్ కంటే 8 రెట్లు విటమిన్ సి ఉంటుంది. ఇది థైరాయిడ్ ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుంది. దాంతోపాటు విటమిన్ సి అనేది జుట్టుకు బాగా ఉపయోగపడుతుంది.
అరటిపండ్లు :
థైరాయిడ్ నియంత్రణకు అరటి పళ్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.అరటిలో ఉండే పుష్కలమైన పోషక పదార్ధాలు ధైరాయిడ్ నియంత్రణలో దోహదపడతాయి. ముఖ్యంగా విటమిన్ బి 6, విటమిన్ సి, డైటరీ ఫైబర్, మాంగనీస్‌లు థైరాయిడ్‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి. థైరాయిడ్ ఉన్న పెషేంట్స్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల బరువు క్రమంగా తగ్గుతారు. అలాగే ఫైబర్ జీర్ణక్రియను నియంత్రించడంలో సహాయపడుతుంది. దేహంలో ఏర్పడ్డ చెడు పదార్థాలను తొలగించడానికి ఫైబర్ వేగవంతం పనిచేస్తుంది. వీటితో పాటుగా రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు ఉండేలా చూసుకోవాలి.