NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

అన్న మావోడే .. తమ్ముడే పరాయివాడైయ్యాడు – రేవంత్ రెడ్డి

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో పెద్ద రచ్చకు దారి తీస్తొంది. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన సమయంలో ఆయనను ఉద్దేశించి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై రాజగోపాల్ రెడ్డి సోదరుడు కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీరియస్ అవ్వడం, ఈ విషయంలో రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయనను కూల్ చేసే విధంగా వివరణ ఇచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడనీ, తాను రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి మాత్రమే మాట్లాడినట్లు చెప్పారు రేవంత్ రెడ్డి.

 

తనకు, వెంకటరెడ్డికి మధ్య అంతరాలు పెంచేలా కొందరు ప్రయత్నించినందు వల్లనే ఆయన అపార్ధం చేసుకున్నట్లు చెప్పారు. రాజగోపాల్ రెడ్డి సొంత పార్టీని ముంచేందుకు ప్రయత్నించిన ద్రోహిగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి.. కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎప్పటికీ తమ నాయకుడేనని స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన పోరాటాలు, కాంట్రాక్ట్ ల గురించి తేల్చేందుకే చుండూరుకు వస్తానని ప్రకటించాననీ, నిజాయితీపరుడైతే తమతో చర్చకు రావాలని రాజగోపాల్ రెడ్డికి సవాల్ విసిరారు రేవంత్ రెడ్డి. అపోహలతో మా వెంకన్న (వెంకటరెడ్డి) మనస్తాపం చెందాల్సిన అవసరం లేదని అన్నారు.

మరో పక్క తాను పార్టీ మారుతున్నానంటూ అసత్య ప్రచారం చేసే వారిపై లీగల్ నోటీసులు ఇస్తానని హెచ్చరించారు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి బ్రాండ్ లేదనడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో మూడున్నర దశాబ్దాలుగా పని చేస్తున్నాననీ, తెలంగాణ కోసం మంత్రిపదవికి రాజీనామా చేశానని వెంకటరెడ్డి తెలిపారు. తాను నాలుగు పార్టీలు మారి రాలేదని అన్నారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఇంతకు ముందే కోరానని చెప్పారు. సోనియా గాంధీ తనకు పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ గా నియమించారని తెలిపారు.

టార్గెట్ చంద్రబాబు: కుప్పం వైసీపీ ఇన్ చార్జి భరత్ కు మంత్రి పదవి ఖాయం చేసిన సీఎం వైఎస్ జగన్

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju