జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ టైం “RRR” తో ఇండస్ట్రీ హిట్ అందుకోవడం జరిగింది. కాకపోతే ఈ సినిమాలో తారక్ తో పాటు చరణ్ కూడా నటించాడు. జక్కన్న దర్శకత్వం తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది మార్చి నెలలో విడుదలయ్యి దాదాపు 1000 కోట్లకు పైగానే కలెక్షన్ సాధించడం తెలిసిందే. ఈ సినిమాలో తారక్ కొమరం భీం పాత్రలో గుండెలను పిండే రీతిలో పరకాయ ప్రవేశం చేశాడు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. అమాయకుడిగా ఇంకా గోండు జాతి కోసం ఎంతటికైనా తెగించే వాడిగా ఎన్టీఆర్ నటన హృదయాలను ఎంతగానో ఆకట్టుకుంది.
దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలో ఈ సినిమాతో తారక్ చాలామందిని అలరించాడు. “RRR” విజయాన్ని ఎంతో ఆస్వాదించిన ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాలతో చెయ్యబోయే ప్రాజెక్టు ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు. ఈపాటికి షూటింగ్ మొదలు కావాల్సి ఉండగా ఉన్న కొద్ది ఆలస్యం కావడంతో ఇటీవల ఎన్టీఆర్ అనారోగ్యానికి గురైనట్లు అందువల్లే సినిమా షూటింగ్ ఆలస్యమైనట్లు వార్తలు రావడం జరిగాయి. ఎన్టీఆర్ కి భుజం నొప్పి అని .. వైద్యుల విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. వస్తున్న ఈ వార్తలలో వాస్తవం లేదని ఎన్టీఆర్ సన్నిహితులు తాజాగా తెలియజేశారు.
ప్రస్తుతం తారక్ కుటుంబంతో కలిసి హాలిడే ట్రిప్పులో ఉన్నారని.. “RRR” విజయాన్ని ఆస్వాదిస్తున్నారని చెప్పుకోచ్చారు. ఇలా ఉంటే కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయేది తన కెరియర్ లో 30వ సినిమా కావటంతో తారక్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అంట. ఈ సినిమాకి సంబంధించి పాత్రకి కొద్దిగా వెయిట్ తగ్గే పని కూడా స్టార్ట్ చేసినట్లు సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన “జనతా గ్యారేజ్” మంచి విజయం సాధించడంతో…”NTR 30″ సినిమాపై నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.