NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

బందరు ప్రాంత ప్రజలకు శుభ వార్త చెప్పిన సీఎం వైఎస్ జగన్

మచిలీపట్నం (బందరు) ప్రాంత ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. వైఎస్ఆర్ నేతన్న హస్తం నాల్గవ విడత నిధులను పంపిణీ కార్యక్రమంలో భాగంగా గురువారం పెడనలో రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్ల ను బటన్ నొక్కి వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ఇప్పటి వరకూ నేతన్నల సంక్షేమం కోసం రూ.2,049 కోట్ల ఖర్చు చేశామనీ, ఇంతకు ముందు ఏ ప్రభుత్వం ఇంతలా సాయం అందించలేదని అన్నారు. ప్రతి చేనేత కుటుంబానికి ఇప్పటి వరకూ రూ.96 వేలు సాయం అందించామన్నారు. ఈ దేశ స్వాతంత్ర సమరాన్ని ఒక మగ్గం మార్చేసిందనీ, అాలంటి మగ్గం నేసే నేతన్నలకు అండగా తమ ప్రభుత్వం నిలబడుతోందని తెలిపారు.

 

ఈ ప్రాంత ప్రజలకు గుడ్ న్యూస్ తెలియజేస్తున్నానంటూ మచిలీపట్నం పోర్టుకు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు సీఎం జగన్. త్వరలో పోర్టు శంకుస్థాపనకు వస్తానని సీఎం జగన్ ప్రకటించారు. పోర్టుకు కోర్టు అనుమతి ఇవ్వడం శుభపరిణామమని అన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగిందన్నారు. ఈ కామర్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని చెప్పారు. చేనేత వస్త్రాలను అప్కో ద్వారా మార్కెటింగ్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంలోనూ గత ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు మంచి పనులు చేస్తుంటే ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ సీఎం జగన్ దుయ్యబట్టారు.

 

ఈ కార్యక్రమంలో మంత్రులు జోగి రమేష్, ఆర్కె రోజా, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, చీఫ్ విప్ లు సామినేని ఉదయభాను, ప్రసాదరాజు, ఎమ్మెల్యేలు పేర్ని నాని, కొడాలి నాని, పార్ధసారధి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

కుప్పంలో తీవ్ర ఉద్రిక్తత .. రోడ్డుపై భైటాయించిన చంద్రబాబు ..డీజీపీ ఆఫీసు వద్ద టీడీపీ నేతల ధర్నా

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju