ఆస్తమా వ్యాధి గురించి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది.కొందరికి అయితే చిన్న వయసులోనే ఆస్తమా వ్యాధి వస్తుంది.ఆస్తమా వ్యాధి ఉన్నవారికి డాక్టర్లు ఎక్కువగా ఇన్హేలర్స్ వాడమని సలహా ఇస్తూ ఉంటారు. నిజానికి మీలో చాలా మందికి ఇన్ హెలర్స్ ను వాడడం మంచిదా? కదా అనే అనుమానం వచ్చే ఉంటుంది.ఎందుకంటే ఇన్ హెలర్స్ లో మందును పెట్టి పీల్చేటప్పుడు ఆ మందు నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్తుంది.
ఇన్హేలర్స్ వాడితే ఊపిరితిత్తులకు ప్రమాదామా?
అలా ఊపిరితిత్తులోకి మందు పీలవడం వలన ఏదైనా హాని జరుగుతుందేమో అని కొందరు ఆందోళన పడుతుంటారు. అయితే నిజానికి ఇన్హేలర్స్ వాడడం వలన ఊపిరితిత్తులకు ఎలాంటి హాని జరగదు. అవి వాడడం వలన ఆరోగ్యానికి మంచే జరుగుతుంది.నిజానికి మనం ఏదన్నా ఒక మందును మింగితే ఆ మందు శరీరంలోని ఊపిరితిత్తులకే కాకుండా శరీరంలోని మిగతా అన్ని అవయవాలలలోని కణాలకూ చేరుతుంది.
ఇన్హేలర్స్ లో వాడే మందు మంచిదేనా?
కానీ ఇన్హేలర్స్ విషయంలో అలా ఏమి జరగదు ఎందుకంటే ఇన్ హెలర్స్ లోని మందు కేవలం సమస్య ఉన్న చోటే అంటే కేవలం ఊపిరితిత్తులలోనే చికిత్స జరిగేలా చూస్తాయి.అలాగే ఇన్ హెలర్స్ లో వాడే మందు మోతాదు కేవలం మైక్రోగ్రాముల్లో మాత్రమే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు.అంటే టానిక్స్, ట్యాబ్లెట్లతో పోలిస్తే ఇనహేలర్స్ లో వాడే మందు చాలా తక్కువ మోతాదు కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా పిల్లలు, పెద్దలు ఇన్ హేలర్స్ వాడవచ్చు.