NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

పవన్ కళ్యాణ్ పై సజ్జల, బొత్స ఫైర్ .. సన్నాసి మాటలు అంటూ మండిపాటు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు ఫైర్ అయ్యారు. వైసీపీ సర్కార్ పై పవన్ చేస్తున్న విమర్శల నేపథ్యంలో ఈ నేతలు కౌంటర్ లు ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కు సబ్జెక్ట్ తో పాటు పార్టీ విధానం కూడా లేదని మంత్రి బొత్స విమర్శించారు. రాజకీయాలు అంటే రెచ్చగొట్టడం కాదనే విషయం పవన్ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. అసలు రాబోయే తరాలకు పవన్ ఏమి చెప్పదల్చుకున్నారని బొత్స ప్రశ్నించారు.  కేఏ పాల్ కి పవన్ కళ్యాణ్ కు తేడా కనిపించడం లేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ను ఎవడు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. సన్నాసి మాటలు ఎందుకని ప్రశ్నించారు. రాజ్యాంగం, చట్టం అంటే పవన్ కు తెలియదన్నారు. రాజ్యాంగం, విలువలు తెలిస్తే అలాంటి సన్నాసి మాటలు అతని నోటి వెంట రావని అన్నారు. మాట్లాడకూడని మాటలు పవన్ మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ఏమి లేని ఇస్తరాకు లాగ ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు.

Botsa Satyanarayana, Sajjala Ramakrishna Reddy Fires On pawan Kalyan

 

జగన్ ప్రభుత్వంలో రాజ్యాంగ బద్దంగా, చట్టబద్దంగా పాలన సాగుతోందని బొత్స అన్నారు. ఎస్సీలకు జగన్ హయాంలో ఎంత మేర చేకూరిందో తెలుసుకోవాలన్నారు. డీబీటీ ద్వారా పేదలకు నిధులను అందిస్తున్నామన్నారు. అదేమీ తెలియకుండా వాళ్లని కొడతా, వీళ్లని కొడతా అంటే సరిపోతుందా, ఇలాంటి మాటల ద్వారా ఈ సమాజానికి ఎమి చెప్పాలనుకుంటున్నాడని ప్రశ్నించారు. తమ పార్టీ విధానం వికేంద్రీకరణేనని స్పష్టం చేశారు. మూడు ప్రాంతాలూ అబివృద్ధి జరగాలన్నది తమ లక్ష్యమనీ, మూడు రాజధానులు, 26 జిల్లాలు తమ విధానమనీ, అయిదు కోట్ల ప్రజల అభివృద్ధి తమ విధామని పేర్కొన్నారు. ఈ విషయం ఇంతకు ముందూ చెప్పామనీ, ఇప్పుడూ చెబుతున్నామని అన్నారు. పవన్ లాంటి వ్యక్తులను చూస్తుంటే ఈ రాజకీయాలపై విరక్తి కలుగుతోందని పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ లకు ఒక్క అమరావతి అభివృద్ధి చెందితే చాలన్నారు. వాళ్లది దోపిడీ విధానమనీ, తమది అభివృద్ధి విధానమని బొత్స పేర్కొన్నారు.

తనపై పవన్ కళ్యాణ్ విష ప్రచారం చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. ముందు వాళ్ల సీఎం అభ్యర్ధి ఎవరనేది క్లారిటీకి రావాలన్నారు. విడివిడిగా వచ్చినా, కలిసొచ్చినా తమకు ఒకేననీ, పవన్ రోల్ ఏంటో అందరికీ తెలుసునని అన్నారు. సబ్ ప్లాన్ దుర్వినియోగం ఆరోపణలపై పవన్ దగ్గర అధారాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. చంద్రబాబు రిమోట్ నొక్కితే పవన్ మాట్లాడతారని దుయ్యబట్టారు. చంద్రబాబు హయాంలో చేసింది ఏమీ లేదు కాబట్టే ప్రచారం ఎక్కువ చేసుకున్నారని సజ్జల విమర్శించారు.

Read More: Republic Day Celebration: ఏపి, తెలంగాణలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఇలా .. ట్విస్ట్ ఏమిటంటే..?

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?