NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ.. బాలినేని మాటలు జగన్ మాటలుగానే భావిస్తున్నానన్న ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన కోటంరెడ్డి .. బుధవారం మీడియా సమావేశంలో అందుకు సంబంధించి ఇది అధారం అంటూ ఓ విషయాన్ని బయటపెట్టారు. తన ఫోన్ ట్యాప్ చేస్తున్న విషయాన్ని తనపై అభిమానంతో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి చెప్పారని వెల్లడించారు. కానీ తాను మొదట నమ్మలేదన్నారు. వైఎస్ఆర్ కుటుంబానికి తాను ఎప్పుడూ విధేయుడుగానే ఉన్నాననీ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా పార్టీ కోసం కష్టపడ్డానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత గుర్తింపు ఇవ్వకపోయినా బాధపడలేదన్నారు. పార్టీలో ఎన్నో అవమానాలు భరించానని, పార్టీ గురించి ఒక్క మాట కూడా తప్పుగా ఎక్కడా మాట్లాడలేదన్నారు. అయినప్పటికీ తన ఫోన్ చేశారని, అందుకు సంబందించి 20 రోజులకు ముందు ఆధారం దొరికిందన్నారు. తన చిన్న నాటి స్నేహితుడైన ఓ కాంట్రాక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణ బయటకు వచ్చిందన్నారు.

Kotamreddy Sridhar Reddy

 

ఏపి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు నెంబర్ నుండి కాల్ చేసి సీఎం జగన్ కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారన్నారు. తన స్నేహితుడితో మాట్లాడిన ఆడియోను తనకు పంపించారని తెలిపారు. ఇది ఫోన్ ట్యాపింగ్ కాదా అని అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ ఒక్క ఎమ్మెల్యేలతో ఆగదనీ, మంత్రులు, న్యాయమూర్తులు, ఐపీఎస్ల ఫోన్లు, విలేఖరులు, మీడియా యాజమాన్యాల ఫోన్ లు కూడా ట్యాప్ చేస్తారని ఆరోపించారు. అవమానించిన చోట ఇక తాను ఉండకూడదని నిర్ణయించుకున్నానని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేయనని చెప్పేశారు కోటంరెడ్డి. తనకు నటన చేతకాదని, మోసం చేయడం రాదని కోటంరెడ్డి అన్నారు.

పార్టీ నుండి వెళ్లే వారు వెళ్లొచ్చని బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ బాలినేని మాటలను సీఎం మాటలుగానే భావిస్తున్నానని అన్నారు.  ఫోన్ ట్యాపింగ్ అంశంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు కోటంరెడ్డి, దేశ ద్రోహులు, స్మగ్లర్లపైనే అనుమతి తీసుకుని ఫోన్ ట్యాప్ చేస్తారని, ప్రభుత్వ పెద్దలే ఫోన్లు ట్యాపింగ్ చేస్తుంటే ఇంకెవరికి చెప్పాలని ప్రశ్నించారు కోటంరెడ్డి.

విశాఖ నుండి రాజధాని పాలన ముహూర్తం ఎప్పుడో చెప్పేసిన టీడీపీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి..! అసలు మ్యాటర్ ఏమిటంటే..?

Related posts

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju