NewsOrbit
న్యూస్

ప్రముఖుల ఉగాది శుభాకాంక్షలు ఇలా..

తెలుగు రాష్ట్రాల్లో శ్రీ శోభకృత్ నామ ఉగాది పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహనరెడ్డి, కేసిఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర పార్టీలు, నేతలు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలకు శుభాలు చేకూరాలని, రాష్ట్రాలతో పాటు దేశం అభివృద్ధి చెందాలని ప్రముఖులు ఆకాంక్షించారు.

Ugadi Greetings

 

ప్రధాని మోడీ: “అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త ఆశలు, కొత్త ఆరంభాలతో ముడిపడి ఉన్న ఉత్సాహభరితమైన పండుగ ఇది. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అమితమైన ఆనందాన్నీ, ఆరోగ్యాన్నీ తీసుకురావాలని ప్రార్ధిస్తున్నాను” అని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

అమిత్ షా: “మన తెలుగు సోదర సోదరీమణులకు నూతన సంవత్సరానికి స్వాగతం పలికే ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ పండుగ మీ జీవితాలలో శాంతి మరియు శ్రేయస్సును కలిగించాలని కోరుకుంటున్నాను” అని ట్వీట్ చేశారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్: రాష్ట్ర ప్రజలందరికీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. శోభకృత్ నామ సంవత్సరంలో అన్నీ శుభాలు జరగాలని, రైతులకు మేలు కలగాలని, నా అక్క చెల్లెమ్మలు ఆనందంగా ఉండాలని, సకల వృత్తుల వారు సంతోషంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను అని సీఎం జగన్ తెలిపారు.

కేసిఆర్: రాష్ట్ర ప్రజలకు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ శోభకృత్ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది.. రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. సాగునీరు, తాగునీరు, పచ్చని పంటలతో తెలంగాణ లో నిత్య వసంతం నెలకొన్నదని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దాని అనుబంధ రంగాలు, వృత్తులు బలపడి, తెలంగాణ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థ పరిపుష్టమైందని అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. శోభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణతో పాటు భారతదేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని సీఎం కేసిఆర్ ఆకాంక్షించారు.

చంద్రబాబు: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. మనందరం శోభకృత్ నామ తెలుగు సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఏపి ప్రజల జీవితాల్లో కొత్త ఏడాది పెనుమార్పులు తేబోతుంది. రాష్ట్రానికి శుభసూచకం. శుభప్రదమైన ఆ మార్పును స్వాగతిద్దామని చంద్రబాబు ఆకాంక్షించారు. తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైఎస్ఆర్ టీపీ అదినేత్రి వైఎస్ షర్మిల, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తదితర ప్రముఖులు తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

ఉగాది పండుగ వేళ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju