NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

YSRCP:  ఏపీలో ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేన పార్టీలకు భారీగా షాక్ లు ఇచ్చారు ఆ పార్టీల నేతలు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా అనేక నియోజకవర్గాల్లో ఆశావహులకు టికెట్ లు దక్కలేదు. దీంతో ఆయా పార్టీల్లో అసంతృప్తి నేతలు వలస బాట పట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వివిధ జిల్లాలకు చెందిన నేతలు వైసీపీలో చేరారు.

రాజంపేట మాజీ టీడీపీ ఇన్ చార్జి గంటా నరహరి మంగళవారం సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. చాలా కాలంగా టీడీపీ రాజంపేట ఇన్ చార్జిగా ఉన్న గంటా నరహరి ఈ నెల 13వ తేదీన జనసేన పార్టీలో చేరారు. అయితే రాజంపేట లోక్ సభ స్థానాన్ని టీడీపీ పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించగా, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ని అభ్యర్ధిగా ఆ పార్టీ కేటాయించింది. అటు టీడీపీలో ఆ తర్వాత జనసేనలోనూ ఆయనకు టికెట్ లభించే పరిస్థితి లేకపోవడంతో జనసేన పార్టీకీ గుడ్ బై చెప్పారు గంటా నరహరి. ఇవేళ సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరగా, ఆయనకు జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిధున్ రెడ్డి, ఒంగోలు లోక్ సభ వైసీపీ అభ్యర్ధి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు.

అలానే నూజివీడు  మాజీ ఎమ్మెల్యే, మాజీ బీజేపీ నేత చిన్నం రామకోటయ్య కూడా వైసీపీలో చేరారు. విజయవాడకు చెందిన పలువురు టీడీపీ మాజీ కార్పోరేటర్లు, జనసేన నాయకులు వైసీపీలో చేరారు. మాజీ కార్పోరేటర్ లు గండూరి మహేష్, నందెపు జగదీష్, మాజీ కోఆప్షన్ సభ్యుడు కొక్కిలిగడ్డ దేవమణి, టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర సెక్రటరీ కోనూరు సుబ్రమణ్యం (మణి), మాజీ డివిజన్ అధ్యక్షుడు గోరంట్ల శ్రీనివాసరావు, జనసేన విజయవాడ తూర్పు నియోజకవర్గ నాయకుడు బత్తిన రాము తదితరులు వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ, వైసీపీ అభ్యర్ధి కేశినేని నాని, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ రుహుల్లా, విజయవాడ ఈస్ట్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి దేవినేని అవినాష్ లు పాల్గొన్నారు.

అలానే విశాఖకు చెందిన సీనియర్ నాయకులు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. జీవి రవిరాజు, బొగ్గు శ్రీనివాస్, జనసేన నాయకురాలు బొడ్డేటి అనురాధ లు జగన్ చేతుల మీదుగా వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, గాజువాక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గుడివాడ అమరనాథ్, విశాఖ నార్త్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి కేకే రాజు పాల్గొన్నారు. అదే విధంగా సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు కూడా వైసీపీలో చేరారు. సూళ్లూరుపేటకు చెందిన వేనాటి రామచంద్రారెడ్డి, వెంకటగిరికి చెందిన మస్తాన్ యాదవ్, మాజీ ఎమ్మెల్సీ అంగలూరి లక్ష్మీశివకుమారి, గొరకపూడి చిన్నయ్య దొర తదితరులు వైసీపీలో చేరారు.

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?