NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Congress: కడప నుండి వైఎస్ షర్మిల పోటీ

Congress: ఢిల్లీలో కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశం ముగిసింది. ఎపీలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్ధులను పార్టీ దాదాపు ఖరారు చేసింది. ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల కమిటీ (సీఈసీ) భేటీలో ఈ మేరకు అభ్యర్ధుల జాబితాకు తుది రూపు తీసుకొచ్చినట్లు సమాచారం. సీఈసీ సమావేశానికి ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తో పాటు ముఖ్యనేతలు హజరైయ్యారు. 117 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాలకు అభ్యర్ధులుగా పలువురి పేర్లను ఆ పార్టీ అధిష్టానం ఆమోదం తెలిపినట్లు తెలుస్తొంది. 58 అసెంబ్లీ, 8 లోక్ సభ స్థానాల అభ్యర్ధులను పెండింగ్ లో ఉంచినట్లు సమాచారం.

YS Sharmila

కడప లోక్ సభ స్థానం నుండి వైఎస్ షర్మిల పోటీ చేయాలని కాంగ్రెస్ ఎన్నికల కమిటీ నిర్ణయించింది. అలానే రాజమహేంద్రవరం నుండి గిడుగు రుద్ర రాజు పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. వీరితో పాటు విశాఖ లోక్ సభ స్థానం నుండి సత్యారెడ్డి, కాకినాడ నుండి పల్లంరాజు, బాపట్ల నుండి జేడీ శీలం,  ఏలూరు నుండి లావన్య, రాజంపేట నుండి నజీర్ అహ్మద్, చిత్తూరు నుండి చిట్టిబాబు, హిందూపురం నుండి షాహీన్  అభ్యర్ధిత్వాలు ఖరారైనట్లు తెలిసింది.

నంద్యాల, తిరుపతి, అనంతపురం, కర్నూలు, విజయవాడ, అరకు, గుంటూరు, అమలాపురం లోక్ సభ స్థానాలను పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. మాజీ మంత్రి, సీనియర్ నేత రఘువీరారెడ్డి ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నట్లు తెలిసింది.

కడప లోక్ సభ స్థానం నుండి వైసీపీ అభ్యర్ధిగా ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీఎం జగన్ ప్రకటించారు. జగన్ సోదరి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలుస్తున్నారు. దీంతో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికే చెందిన ఇద్దరు (అన్న చెల్లెలు) కడప లోక్ సభ బరిలో ప్రత్యర్ధులుగా నిలుస్తుండటంతో పోటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

CM YS Jagan: జగన్ అక్రమాస్తుల కేసుల విచారణపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?