(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఇప్పటి వరకూ రెండు తలల పాములను చూశాం. కానీ, ఏడు తలల పాము గురించి ఎప్పుడైనా విన్నారా? ఏడు తలల పాము గురించి పురాణా కథల్లోనే విన్నాం. కానీ నిజంగా ఏడు తలల పాము ఉందంటే ఎవరూ నమ్మరు. అయితే, కర్ణాటకలో ఈ ఏడు తలల పాము కనిపించిందట. కనకపురలోని మరిగౌడన్న దొడ్డి గ్రామంలో ఈ వింత చోటు చేసుకుంది. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. బుధవారం గ్రామంలోని గుడి పరిసరాలను శుభ్రం చేస్తున్న బాలప్ప అనే వ్యక్తికి దీన్ని చూశాడు. గుడికి పది అడుగుల దూరంలో పాము కుబుసం ఉండటాన్ని గమనించాడు. దీంతో గ్రామస్థులంతా కుంకుమ, పసుపులతో పూజలు చేస్తున్నారు.
Multi-headed snake’s skin draws crowds in Kanakapura #Karnataka pic.twitter.com/suXh4eGHhl
— TOI Bengaluru (@TOIBengaluru) October 10, 2019
గతంలో కూడా ఏడు తలల పాము కుబుసం ఇక్కడ కనిపించిందని, అప్పుడే దానికి గుడి కట్టాలని నిర్ణయించామని అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే వ్యక్తి తెలిపాడు. పాములు నెల నుంచి రెండు నెలల మధ్య కాలంలో చర్మాన్ని విడుస్తాయి. దాన్నే కుబుసం అని అంటారు. ఇలా కుబుసాన్ని విడిస్తేనే అవి పెద్దవిగా ఎదుగుతాయి. ఈ వీడియోలో రికార్డైన కుబుసాన్ని పరిశీలిస్తే.. ఒకే పాముకు అనేక తలలు ఉన్న విషయం స్పష్టమవుతోంది. అయితే, ఏడు తలల పాము అనేది పురాణాలకు పరిమితం అని, వాస్తవానికి అవి ఉనికిలో లేవని నిపుణులు భిన్న వాదన వినిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.