(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఓ డాక్టర్ చిన్ని పాప చేతికి సిరంజి గుచ్చి రక్తం తీస్తూ ఆ పాప ఏడవకుండా దృష్టి మళ్లించేందుకు పాట పాడుతున్న వీడియో ఒకటి ఆన్లైన్లో తిరుగుతున్నది. ఆ పాప తల్లే వీడియోను షేర్ చేసింది. ‘ఇది చాలా స్పెషల్‌గా ఉంది. మా పాప చేతికి సూది గుచ్చితే ఏడవకుండా ఉండదు. అలాంటిది ఈ డాక్టర్ గమ్మత్తు చేశాడు’ అని ఆ తల్లి పేర్కొన్నది.
https://www.facebook.com/shannonwemyssx/videos/2722911977773134/
డౌన్స్ సిండ్రోమ్‌తో బాధపడుతున్న ఆ చిన్నారి తన చేతికి సూది గుచ్చుకున్నా పట్టించుకోకుండా పాట పాడుతున్న డాక్టర్నే చూస్తూ ఉంటుంది. స్కాట్లాండ్కు చెందిన ఆ డాక్టర్ పేరు రెయాన్ కోయెట్జీ. ఇలాంటి డాక్టర్‌ను తానెప్పుడూ చూడలేదనీ, అతను ఎవరినైనా నవ్విస్తాడనీ పాప తల్లి వ్యాఖ్యానించింది.
రోగుల దగ్గర పాడడం తనకు అలవాటనీ, పాట తనకు సహజంగా వస్తుందనీ డాక్టర్ అన్నట్లు ఆ ఆసుపత్రి ఒక ప్రకటనలో తెలిపింది. పిల్లల వార్డులో సిల్లీగా ప్రవర్తించడం, పాటలు పాడడం వారిని ఆకట్టుకుంటాయని అతను అన్నాడు.