(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
ఒక నెమలి బావిలో పడిపోయింది. అది గమనించిన గ్రామస్థులు దానిని బయటకు తీయాలని సంకల్పించారు. కానీ బావిలో పాములు ఉన్నాయి. ఏం చేయాలో పాలు పోలేదు. చివరికి ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు. ధైర్యంగా బావిలో దిగి ఆ నెమలిని రక్షించాడు. తమిళనాడులో జరిగిందీ సంఘటన. ఈ వీడియో వైరల్ అయింది.
గ్రామస్థులు మొదట తాళ్లతో ఒక ఉచ్చు తయరుచేశారు. దానిని తన నడుముకు బిగించుకుని ఆ వ్యక్తి నెమ్మదిగా 30 అడుగుల లోతు ఉన్న ఆ బావి లోపలకు దిగాడు. నీళ్ల వరకూ దిగిన తర్వాత నెమలిని పట్టుకోవడానికి అతను కాస్త కష్టపడాల్సి వచ్చింది. చివరికి దానిని దొరకబుచ్చుకుని సహచరులు తాళ్లను లాగితే మళ్లీ పైకి వచ్చాడు. అంతవరకూ ప్రాణంపై ఆశలు వదులుకున్న నెమలిని పైన వదలగానే ఒక్కుదుటున పారిపోయింది.