NewsOrbit
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

‘ఇక బుకాయింపులు చెల్లవు’

‘ద హిందూ’ ఆంగ్ల దినపత్రిక రఫేల్ స్కామ్‌పై శుక్రవారం ప్రచురించిన కథనం సంచలనం సృష్టించింది. దాని ఆధారంగా కాంగ్రెస్, సిపిఎం మోదీ ప్రభుత్వంపై దాడికి దిగాయి. భారత వైమానిక దళం కోరిన ఏడు స్వ్కాడ్రన్ల (126 విమానాలు) ఫైటర్ జెట్స్ కాకుండా కొనుగోలును కేవలం 36 విమానాలకే పరిమితం చేసి మోదీ ప్రభుత్వం దేశ భద్రత విషయంలో రాజీ పడిందని మాజీ ఆర్ధిక మంత్రి పి. చిదంబరం ట్విట్టర్‌లో విమర్శించారు.

యుపిఎ ప్రభుత్వం హయాంలో 126 యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇండియా వైమానిక దళం కోరిన మార్పులు చేయడానికి రఫేల్ యుద్ధవిమానాల కంపెనీ ‘దస్సాల్ట్ ఏవియేషన్’ అంగీకరించింది. అందుకు ఒక్కసారి చెల్లింపు కింద కొంత మొత్తం చెల్లించేందుకు ఇండియా అంగీకరించింది. ఆ ఒప్పందం కింద దస్సాల్ట్ 18 ఫైటర్ జెట్స్ పూర్తి స్థాయిలో తయారు చేసి ఇస్తుంది. మిగతా 108 విమానాలు ఇండియాలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్తాన్ ఎయిరోనాటిక్స్‌లో దస్సాల్ట్ సాంకేతిక బదిలీతో తయారవుతాయి.

ఈ ఒప్పందంపై చర్చలు చివరి దశలో ఉండగా 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లి 126 విమానాలకు బదులు 36 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు అక్కడ ప్రకటించారు.

‘ద హిందూ’ పత్రిక కథనం సారాంశం ఏమంటే ఇండియా కోరిన మార్పుల తాలూకూ ఖర్చు 126 విమానాలకు బదులు 36 విమానాలకే చెల్లించాల్సి వచ్చేసరికి ఆ ఖర్చు ఒక్కో విమానానికి 11.11 మిలియన్ యూరోల నుంచి 36.11 మిలియన్ యూరోలకు పెరిగింది. ఫలితంగా మొత్తం మీద ఒక్కో ఫైటర్ జెట్ ఖరీదు 90.41 మిలియన్ యూరోల నుంచి 127.86 మిలియన్ యూరోలకు పెరిగింది. ఈ పెంపుదల 41.4 శాతం.

రఫేల్ డీల్‌కు సంబంధించిన అన్ని పత్రాలూ తమ దగ్గర ఉన్నాయనీ, వాటిని బహిర్గతం చయడం లేదనీ ద హిందూ పేర్కొన్నది. రక్షణ పరికరాల సమీకరణ మండలి ఛైర్మన్ హోదాలో రక్షణ మంత్రి మనహర్ పరికర్ ఈ ఒప్పందంపై నిర్ణయం తీసుకోవచ్చు. అయితే ఆయన దాని జోలికి పోకుండా తన పై స్థాయిలోని భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీకి నివేదించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఆ కమిటీ ఒప్పందాన్ని ఆమోదించింది.

తన ఆశ్రిత వాణిజ్యవేత్తకు సహాయం చేసేందుకే మోదీ హడావుడిగా రఫేల్ ఒప్పందాన్ని మార్చి కుదుర్చుకున్నారనీ, ఆ క్రమంలో దేశ రక్షణను బలి పెట్టారనీ సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరి ట్వీట్ చేశారు. అసలు విషయం బయటపడిపోయిందనీ, ఇక ఎన్ని అబద్ధాలు వల్లించినా కుదరదనీ ఆయన వ్యాఖ్యానించారు.

Related posts

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

Leave a Comment