NewsOrbit
న్యూస్

జగన్ – చంద్రబాబుల మధ్యలో నిలబడి ఈ సీనియర్ నేత వెరైటీ రాజకీయం!

టీడీపీలో బాబు కనుసైగలతోనే తమ నాయకులను నడిపిస్తుంటారు.. ఇంకా గట్టిగా మాట్లాడితే తాను నిలబెట్టిన స్పీకర్లు కూడా అలానే నడిచారనే విమర్శలూ వచ్చాయి. కానీ మిగిలిన నేతలంతా ఒకెత్తు ఒక టీడీపీ నేత మరొకెత్తు! ఆయనే… గంటా శ్రీనివాస రావు. మిగిలిన నేతలంతా బాబు కనుసైగలు చేస్తే చాలు పనులుచేసుకుంటూ వెళ్లిపోతున్న దశలో… బాబు నోరు తెరిచి అరిచినా, గీపెట్టినా గంటా శ్రీను వినరు, ఆచరించరు.. ఆ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు!! అవును… ఒక్కసారి జరిగినవాటిలో కొన్ని తలచుకున్నా ఈ విషయాలపైనా.. పైన చెప్పుకున్న ఉపోద్ఘాతంపైనా ఒక క్లారిటీ వచ్చేస్తుంది!

ఒకపార్టీ గుర్తుమీద ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు.. ఆ అధినేత మాటే శిరోధార్యంగా ఉంటారు సదరు ఎమ్మెల్యేలు! ఆయనను ఎవరైనా ఒక్కమాట అంటే… ప్రెస్ మీట్ లు పెట్టి, మైకులు చేతపట్టి ఫుల్ హడావిడి చేస్తారు! ఇక అధినేతే స్వయంగా ఒక పని అప్పచెబితే… ఆ పనిలో ఎన్ని మార్కులు కొట్టేయాలా అని ప్లాన్స్ చేసుకుంటారు. ఇదంతా మిగిలిన నేతల పరిస్థితి… కాని గంటా శ్రీనివాసరావు పరిస్థితి వేరు!

విశాఖలో పవన్ లాంగ్ మార్చ్ జరిగితే దానికి టీడీపీ తరఫున వెళ్లమంటే గంటా శ్రీనివాసరావు వెళ్లలేదు. ఇసుక పోరాటం కానీ, ఇంగ్లీష్ మీడియం విషయంలో కానీ విశాఖలో జరిగిన గ్యాస్ లీక్ ఘటనలో కానీ గంటా శ్రీనివాసరావు ఎక్కడా పెదవి విప్పలేదు.. సరికదా అవంతి శ్రీనివాస్ లాంటివారు చంద్రబాబుని కూడ కలిపి ఫుల్ గా విమర్శలు గుప్పించెస్తే స్పందించలేదు.. అసలు చంద్రబాబు విశాఖ వచ్చినపుడు కూడా గంటా గైర్హాజర్ అయ్యారు అంటే… బాబునీ అంత లైట్ తీసుకున్నారన్నమాట!!

అన్నీ చేసి.. టీడీపీలో మిగిలిన నేతలు, కార్యకర్తలు, బాబు ఒక క్లారిటీకి వచ్చేసరికి మహానాడు జూమ్ యాప్ మీటింగుకు అటెండ్ అయ్యారు. దాంతో… తలలుపట్టుకునే పరిస్థితి టీడీపీ అధిష్టాణంది! ఆఖరికి అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డి లను అరెస్టు చేసినప్పుడు కూడా మౌనాన్నే తన బాషగా చేసుకున్నారు గంట. ఇవన్నీ చూశాక కూడా ఇంకా గంటా శ్రీనివాస రావుని టీడీపీ నేతే అనాలా లేక టీడీపీలో అసంతృప్త నేత అనాలా… అదీగాక టీడీపీలో ఉన్న విపక్ష ఎమ్మెల్యే అనాలా? ఏమో బాబుకి గంటాకే తెలియాలి!!

Related posts

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju